Share News

DRUGS: డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలి

ABN , Publish Date - Jun 27 , 2025 | 12:17 AM

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని తహసీల్దార్‌ సురేశకుమార్‌ తదితరులు సూ చించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం ధర్మవరం వనటౌన, టూటౌన పోలీస్‌ స్టేషనల ఆధ్వర్యంలో అధికారులు, విద్యార్థులు తదితరులు అవగా హన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్‌ సురేశకుమార్‌, ఎంఈఓ గోపాల్‌నాయక్‌, టూటౌన సీఐ రెడ్డప్ప, రూరల్‌ సీఐ ప్రభాకర్‌, ముదిగుబ్బ రూరల్‌ సీఐ శ్యామరావు, ఎక్సైజ్‌ శాఖ సీఐ చంద్రమణి హాజరయ్యారు.

DRUGS: డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలి
Officers, police and students rallying in Dharmavaram

ధర్మవరం, జూన 26(ఆంధ్రజ్యోతి): మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని తహసీల్దార్‌ సురేశకుమార్‌ తదితరులు సూ చించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం ధర్మవరం వనటౌన, టూటౌన పోలీస్‌ స్టేషనల ఆధ్వర్యంలో అధికారులు, విద్యార్థులు తదితరులు అవగా హన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్‌ సురేశకుమార్‌, ఎంఈఓ గోపాల్‌నాయక్‌, టూటౌన సీఐ రెడ్డప్ప, రూరల్‌ సీఐ ప్రభాకర్‌, ముదిగుబ్బ రూరల్‌ సీఐ శ్యామరావు, ఎక్సైజ్‌ శాఖ సీఐ చంద్రమణి హాజరయ్యారు. విద్యార్థులు, ప్రజలతో కలిసి స్థానిక కాలేజ్‌ సర్కిల్‌ నుంచి కళాజ్యోతి, ఎన్టీఆర్‌ సర్కిళ్ల మీదుగా గాంధీ సర్కిల్‌ వరకు ర్యాలీ నిర్వహించారు.


తిరిగి కళాజ్యోతి సర్కిల్‌కు చేరుకుని మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రశాంతి, ఆర్డీఓ కార్యాలయ ఏఓ ఖతిజన కుఫ్రా, వీఆర్‌ఓ రవిశేఖర్‌రెడ్డి, న్యాయవాది బాలసుందరి పాల్గొన్నారు.

కదిరి, జూన 26(ఆంధ్రజ్యోతి): యువత మత్తుపదార్దాలకు దూరం గా ఉండాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. అంత ర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పట్టణంలో గురువారం ఎక్సెజ్‌ శాఖ, పోలీసుల ఆధ్వర్యంలో యువతతో కలిసి అవ గాహన ర్యాలీ నిర్వహించారు. పట్ట ణంలోని ఆర్‌అండ్‌బీ బంగ్లా నుంచి, అంబేడ్కర్‌ సర్కిల్‌ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా పాల్గొ న్న ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్తు పదార్ధాలతో యువత పెడదారి పడు తోందన్నారు. మత్తుతో అనేక అనార్థలు జరుగుతున్నాయన్నారు. పిల్లలు మత్తు పదార్ధాలకు అల వాటు పడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు దృష్ట పెట్టాలని కోరారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ, నినాదాలు చేయించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శివనారాయణస్వామి, సీఐ నారాయణ రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 27 , 2025 | 12:17 AM