MSME Survey : సర్వే పూర్తయ్యేనా?
ABN , Publish Date - Feb 28 , 2025 | 12:49 AM
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎ్‌సఎంఈ) పరిశ్రమల సర్వే సకాలంలో పూర్తి చేస్తారో..? లేదో.. అర్థంకాని పరిస్థితి నెలకొంది. పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల వివరాలు సర్వేలో నమోదు చేయడం ద్వారా ప్రభుత్వ పథకాల లబ్ధిపొందే అవకాశం ఉంది. ఈ మేరకు గతేడాది నవంబరు ఆఖరు వారంలో ఎంఎ్‌సఎంఈ సర్వేకి శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది జనవరి ఆఖరుకు పూర్తి చేయాలని తొలుత గడువు విధించారు...

నత్తనడకన ఎంఎ్‌సఎంఈ సర్వే
గడువు పొడిగించినా అదే తీరు
మిగిలింది.. 6 రోజులే..
నేటికీ 44.75 శాతమే పూర్తి
పలుచోట్ల సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం
కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ
అనంతపురం అర్బన, ఫిబ్రవరి 27(ఆంధ్రజోతి): సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎ్‌సఎంఈ) పరిశ్రమల సర్వే సకాలంలో పూర్తి చేస్తారో..? లేదో.. అర్థంకాని పరిస్థితి నెలకొంది. పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల వివరాలు సర్వేలో నమోదు చేయడం ద్వారా ప్రభుత్వ పథకాల లబ్ధిపొందే అవకాశం ఉంది. ఈ మేరకు గతేడాది నవంబరు ఆఖరు వారంలో ఎంఎ్‌సఎంఈ సర్వేకి శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది జనవరి ఆఖరుకు పూర్తి చేయాలని తొలుత గడువు విధించారు. అప్పటికి కేవలం 37.26 శాతం యూనిట్లపై సర్వే చేశారు. ఫిబ్రవరిలో ఇప్పటిదాకా 44.75 శాతం యూనిట్లపై సర్వే చేశారు. ఈ నేపథ్యంలో మార్చి 5వ తేదీలోగా సర్వే పూర్తిచేయాలని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆరు రోజులే గడువు ఉంది. ఇప్పటిదాకా పలు ప్రాంతాల్లో సర్వే ఆశించిన స్థాయిలో ముందుకు
కదలడం లేదు. ఆయా ప్రాంతాల్లోని కొందరు సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యంతోపాటు సంబంధిత ఉన్నతాధికారుల పర్యవేక్షణాలోపమూ ఇందుకు కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా యంత్రాం గం ప్రత్యేక దృష్టి సారించకపోతే లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఏ మేరకు ఉన్నతాధికారులు దృష్టి సారిస్తారో వేచిచూడాల్సిందే.
39,269 యూనిట్ల సర్వే
జిల్లావ్యాప్తంగా 87,756 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా యూనిట్లను సర్వే చేయాల్సి ఉంది. ఇప్పటిదాకా 39,269 యూనిట్లను (44.75 శాతం) మాత్రమే సర్వే చేశారు. ఇందులో 27,044 యూనిట్లు వర్కింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. మిగిలినవి నాట్ వర్కింగ్ అని తేల్చారు. పలు ప్రాంతాల్లో సచివాలయ సిబ్బంది సర్వే చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు సమాచారం. మరికొన్ని చోట్ల వ్యాపారులు సహకరించపోవడంతో ఆశించిన స్థాయిలో ప్రక్రియ ముందుకు సాగడంలేదని తెలిసింది. వ్యాపారుల ఆధార్, పాన, జీఎ్‌సటీ, టర్నోవర్ ఇతర వివరాలు అడుగుతుండటంతో వాటిని ఇస్తే ఏమవుతుందోనన్న అనుమానంతో వ్యాపారులు జంకుతున్నట్లు సమాచారం. సర్వే మూలంగా కలిగే ప్రయోజనాలపై క్షేత్రస్థాయిలో వ్యాపారులకు తెలియజేయడంలో సంబంధిత అధికారులు శ్రద్ధ పెట్టకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రయోజనాలివీ..
ఎంఎ్‌సఎంఈ పోర్టల్‌లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామిక వేత్తల వివరాలు నమోదు చేయడం ద్వారా ప్రభుత్వ పథకాల లబ్ధి పొందే అవకాశం ఉం ది. ఉద్యమ్ రిజిస్ర్టేషన సైతం చేస్తారు. సర్వేలో నమోదు చేసి న సంస్థల్లో అవసరమైన వాటికి స్టాండప్ ఇండియా, ఇతర పరిశ్రమల పథకాల ద్వారా ఆర్థిక సాయం అందిస్తారు. సంస్థలకు మార్కెటింగ్ సహాయం అందించేందుకు ఆలస్యమైన ఆర్థిక చెల్లింపుల సమస్యలు పరిష్కరిస్తారు. అవసరమైన సంస్థలకు జెడ్‌ఈడీ, ఐఎ్‌సఓ, 9000, ఐఎ్‌సఐ తదితర ధృవపత్రాలు పొందడంలో సాయం చేస్తారు. అర్హత కలిగిన యూనిట్లకు పారిశ్రామికవాడలు, ఎంఎ్‌సఎంఈ పార్కులు, కాంప్లెక్స్‌ల్లో ప్లాట్లు కేటాయించే అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాల రూపకల్పనకు ఈ సర్వే ఉపయోగపడుతుంది. ఇంత ప్రాముఖ్యత కలిగిన సర్వేపై అధికారులు, సిబ్బంది.. వ్యాపారులకు అవగాహన కల్పించి, వందశాతం వివరాల నమోదు పూర్తి చేయాల్సి ఉండగా.. ఆశించిన స్థాయిలో సర్వే చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.
గడువులోగా పూర్తికి చర్యలు
ఈ ఏడాది జనవరి ఆఖరులోగా సర్వే పూర్తి చేయాలని ఇదివరకు ఉన్నతాధికారులు ఆదేశించారు. సర్వే పూర్తికాకపోవడంతో గడువు పొడిగించారు. మార్చి 5వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఆలోగా సర్వే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం.
- శ్రీధర్, పరిశ్రమల శాఖ జిల్లా అధికారి
మరిన్ని అనంతపురం వార్తల కోసం....