MLA: అర్హులందరికి సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే
ABN , Publish Date - Jun 22 , 2025 | 12:08 AM
అర్హులైన వారందరికి సంక్షేమ పథకాలు అందిస్తామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ హామీ ఇచ్చారు. ఆయన శనివారం మండలంలోని మల్లమీదపల్లిలో మూడోరోజు శనివారం మనింటికి మన ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించారు. పంచాయ తీలోని కోటూరు, బనానచెరువుపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఇంటింటికెళ్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు లబ్ధిదారుల తో మాట్లాడి గృహాలు, పింఛన్లు, విద్యుత, రేషనకార్డులు తదితర సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

గాండ్లపెంట, జూన 21(ఆంధ్రజ్యోతి): అర్హులైన వారందరికి సంక్షేమ పథకాలు అందిస్తామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ హామీ ఇచ్చారు. ఆయన శనివారం మండలంలోని మల్లమీదపల్లిలో మూడోరోజు శనివారం మనింటికి మన ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించారు. పంచాయ తీలోని కోటూరు, బనానచెరువుపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఇంటింటికెళ్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు లబ్ధిదారుల తో మాట్లాడి గృహాలు, పింఛన్లు, విద్యుత, రేషనకార్డులు తదితర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైనవారందరికి సంక్షేమ పథకాలన్నీ అందేలా చర్యలు తీసుకుం టామని, ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల ఇళ్ల వద్దకే వచ్చిసమస్యలు తెలుసుకుంటున్నాని, సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బాబురావు, ఎంపీడీఓ వెంకటామిరెడ్డి, వివిధ శాఖలాధికారులు, కన్వీనర్ కొండయ్య, ఎంపీపీ సోముశేఖర్‌రెడ్డి, ఎంపీటీసీ జయరాంక్రిష్ణారెడ్డి, మాజీ సింగల్‌విండో అధ్యక్షులు వెంకటరమణారెడ్డి, మాజీ సర్పంచ ప్రసాద్ , ఎంపీటీసీ భారతి, గంగాధర్, ప్రతాప్‌రెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....