VHP : హిందువులపై దాడులు సహించం : వీహెచపీ
ABN , Publish Date - Mar 08 , 2025 | 12:08 AM
ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట హిందువులపై దాడులు జరుగుతున్నాయని ఇకపై సహించ బోమని విశ్వహిందూ పరిషత జిల్లా అధ్యక్షుడు తాళంకి వెంకట రత్నమయ్య పేర్కొన్నారు. వీహెచపీ స్థానిక కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.

అనంతపురం కల్చరల్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట హిందువులపై దాడులు జరుగుతున్నాయని ఇకపై సహించ బోమని విశ్వహిందూ పరిషత జిల్లా అధ్యక్షుడు తాళంకి వెంకట రత్నమయ్య పేర్కొన్నారు. వీహెచపీ స్థానిక కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 4న రాయచోటిలో వీరభద్రస్వామి పార్వేట ఉత్సవంలో హిందువులపై అన్య మతస్థుల దాడి హిందూ మనోభావాలను దెబ్బతీసేలా ఉందన్నారు. ఈ సందర్భంగా హిందువులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహ రించాలని డిమాండ్ చేశారు. హిందువులందరూ ఐక్యంగా ఉండి హైందవ సంప్రదాయాలను కాపాడాలని పిలుపునిచ్చారు. వీహెచపీ జిల్లా కార్యదర్శి విశ్వనాథరెడ్డి, ఉపాధ్యక్షుడు రమణబాబు, సహాయ కా ర్యదర్శి కిషోర్‌కుమార్‌నాయుడు, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....