ROAD: దుకాణాల ఎదుట తొలగని రేకులు
ABN , Publish Date - Jun 22 , 2025 | 12:04 AM
మండల కేంద్రంలోని నాలుగు రోడ్ల కూడలికి ఇరువైపులా ఉన్న ఆర్‌అండ్‌బీ స్థలాలలో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించు కునేం దుకు రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, పంచాయ తీ అధికారులు మార్కింగ్ ఇచ్చారు. ఆ మార్కింగ్ కూడా పుట్టపర్తి రహదారి లో ఒక్కొక్కరికి ఒకరకంగా మార్కింగ్ ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదిలాఉండగా బుక్కపట్నం రహదారి కి ఇరువైపులా ఉన్న అక్రమ నిర్మా ణా ల తొలగింపు కోసం కూడా మార్కింగ్ ఇచ్చారు.

కొత్తచెరువు, జూన 21 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని నాలుగు రోడ్ల కూడలికి ఇరువైపులా ఉన్న ఆర్‌అండ్‌బీ స్థలాలలో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించు కునేం దుకు రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, పంచాయ తీ అధికారులు మార్కింగ్ ఇచ్చారు. ఆ మార్కింగ్ కూడా పుట్టపర్తి రహదారి లో ఒక్కొక్కరికి ఒకరకంగా మార్కింగ్ ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదిలాఉండగా బుక్కపట్నం రహదారి కి ఇరువైపులా ఉన్న అక్రమ నిర్మా ణా ల తొలగింపు కోసం కూడా మార్కింగ్ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు అక్రమ నిర్మాణంలో భాగంగా దుకాణాల ఎదుట వేసిన రేకులను కూడా తొలగించుకోకపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడు తోంది. అలాగే ఇటీవల గ్రామపం చాయతీకి చెందిన షాపింగ్ కాంప్లెక్ గదులకు పంచాయతీ అధికారులు బహిరంగ వేలం పాట నిర్వహించారు.
పంచా యతీ నిబంధనల ప్రకారం... వ్యాపార గదుల ను వేలం పాటలో దక్కిం చుకున్న వారు తమ షాపుల ఎదుట ఇతరులకు బాడుగకు ఇవ్వరాదు. ఎవరైనా ని బంధనలకు విరుద్ధంగా షాపుల ఎదుట బాడుగలకు ఇస్తే వారి గదుల వేలం సైతం రద్దు చేస్తామని తెలిపారు. అయితే పంచా యతీ అధికారులు ఆ నిబంధనలను తుంగలోకి తొక్కి, చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడంతో వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యాపా రాలను కొనసాగిస్తున్నారనే విమర్శ లు ఉన్నాయి. దీంతో పంచాయతీ అధికారులు చెప్పేది ఒకటి చేసేది మరొకటి అని పలువురు బహిరం గంగా విమర్శలు వినిపిస్తున్నాయి. పంచాయతీ అధికారులకు మామూ ళ్లు ముట్టజెప్పి, గదుల ఎదుట ఏర్పాటు చేసుకున్న షాపులను తొలగించ డం లేదని, దీనికి కొందరు అధికారులు మద్దతు ఇచ్చారన్న ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి షాపుల ఎదుట ఉన్న రేకుల షెడ్‌లను దుకాణాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు. తద్వారా ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా చూడాలని అంటున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....