Share News

UPADHI : జమ కాని ఉపాధి బిల్లులు

ABN , Publish Date - Apr 22 , 2025 | 11:45 PM

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసిన బిల్లులు జమ కాకపోవడంతో పనిచేసే కూలీల ఖాతాల్లోకి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో కూలీకి దాదాపు పన్నెండు వారాలకు పైగా బిల్లులు రావాల్సి ఉందని చెబుతున్నారు. బిల్లులు సకాలంలో జమకాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

UPADHI : జమ కాని ఉపాధి బిల్లులు
Laborers doing employment work

- 12 వారాల రూ. 2.24 కోట్లు పెండింగ్‌

- ఆందోళన వ్యక్తం చేస్తున్న కూలీలు

రాప్తాడు, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసిన బిల్లులు జమ కాకపోవడంతో పనిచేసే కూలీల ఖాతాల్లోకి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో కూలీకి దాదాపు పన్నెండు వారాలకు పైగా బిల్లులు రావాల్సి ఉందని చెబుతున్నారు. బిల్లులు సకాలంలో జమకాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెలలు గడిచినా కూలీ డబ్బు జమ కాకపోతే ఎలా జీవించాలి అని వాపోతున్నారు. వేసవిలో వలసలు నివారించి కూలీలకు స్థానికంగానే పని కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ పథకం నిబందనల ప్రకారం పని పూర్తయిన తరువాత 15 రోజులకు కూలీల ఖాతాల్లో బిల్లులు జమ కావాలి. నిర్ణీత కొలత ప్రకారం కూలీలు పని చేస్తే రోజుకు రూ. 307 కూలీ లబిస్తుంది. ఈ ఏడాది జనవరి నుంచి కూలీలు ఎక్కువగా పనులకు వెళుతున్నారు. జనవరి మొదటి వారం నుంచి నుంచి ఏప్రిల్‌ మొదటి వారం వరకు 12 వారాల బిల్లులు కూలీలకు జమ కావాల్సి ఉంది.నెలలు గడుస్తున్నా కూలి డబ్బు ఖాతాల్లో జమ కాలేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో తొమ్మిది వేలకు పైగా జాబ్‌కార్డులు యాక్టివ్‌లో ఉన్నాయి. దాదాపు ఎనిమి ది వేల మంది కూలీలు ఉపాధి పనులకు వెళతారు. ప్రస్తుతం మూడు వేల మంది ఉపాధి పనులను వెళుతున్నారు. కూలీలు చేసిన పనులకు 12 వా రాలకు గానూ రూ. 2.24 కోట్లు జమ కావాల్సి ఉండగా... సకా లంలో వారి ఖాతాల్లో కూలి డబ్బు జమ కాలేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

త్వరలోనే జమ అవుతాయి- సావిత్రి, ఏపీఓ, రాప్తాడు

కూలీలకు బిల్లులు ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. చేసిన పనులకు బిల్లులు ఆనలైనలో అప్‌లోడ్‌ చేశాం. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే కూలీల ఖాతాల్లో డబ్బు జమ అవుతుంది.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 22 , 2025 | 11:45 PM