KANDUKURI: కందుకూరికి ఘన నివాళి
ABN , Publish Date - May 28 , 2025 | 12:11 AM
ఆధునిక సమాజంలో చోటు చేసుకున్న మూ ఢవిశ్వాసాలను నిర్మూ లించేందుకు కందు కూరి వీరేశలింగం పం తులు జీవితాన్ని, ఆ యన రచనలను మ నం చదవాలని తెలు గు వెలుగు సాహిత్య సామాజిక సేవాసంస్థ అధ్యక్షుడు టీవీ రెడ్డి అన్నారు. ఆయన చూపిన మార్గంలో నడవాలని పేర్కొన్నారు. నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు 106వ వర్ధంతిని మంగళవా రం తెలుగు వెలుగు సాహిత్య సామాజిక సేవాసంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం లోని విశాలాంధ్ర బుక్ హౌస్‌లో నిర్వహించారు.

అనంతపురం కల్చరల్, మే 27(ఆంధ్రజ్యోతి): ఆధునిక సమాజంలో చోటు చేసుకున్న మూ ఢవిశ్వాసాలను నిర్మూ లించేందుకు కందు కూరి వీరేశలింగం పం తులు జీవితాన్ని, ఆ యన రచనలను మ నం చదవాలని తెలు గు వెలుగు సాహిత్య సామాజిక సేవాసంస్థ అధ్యక్షుడు టీవీ రెడ్డి అన్నారు. ఆయన చూపిన మార్గంలో నడవాలని పేర్కొన్నారు. నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు 106వ వర్ధంతిని మంగళవా రం తెలుగు వెలుగు సాహిత్య సామాజిక సేవాసంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం లోని విశాలాంధ్ర బుక్ హౌస్‌లో నిర్వహించారు. వీరేశలింగం పంతులు చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సాహితీకారులు కృష్ణమూర్తి, డాక్టర్ అంకె రామలింగయ్య, కోగిర జయచంద్ర, తోట నాగరాజు, ఏజీ అనీల్‌కుమార్, ఎర్రగుంట కృష్ణారెడ్డి, షేక్ రియాజుద్దీన, గంగిరెడ్డి విశ్వనాథరెడ్డి, సుంకర రమేష్, శేషాద్రి శేఖర్, పరమేశ్వరరావు, సాంబశివుడు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....