Share News

MLA: పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి

ABN , Publish Date - Apr 08 , 2025 | 11:54 PM

వచ్చే విద్యా సంవత్సరం నుంచి నియోజక వర్గంలోని గురుకుల, మోడల్‌ పాఠశాలలు, కేజీబీ వీల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ సూచించారు. ఎమ్మెల్యే మంగళవారం అనంతపు రంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన విద్యా శాఖాధికారులతో సమావేశం నిర్వహించారు.

MLA: పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి
MLA talking to officials

- ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ సూచన

శింగనమల, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): వచ్చే విద్యా సంవత్సరం నుంచి నియోజక వర్గంలోని గురుకుల, మోడల్‌ పాఠశాలలు, కేజీబీ వీల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ సూచించారు. ఎమ్మెల్యే మంగళవారం అనంతపు రంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన విద్యా శాఖాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గతంలో ఉన్న జీఓ 117 రద్దు తరువాత, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయునున్న విద్యా క్యాలెండర్‌ గురించి చర్చించారు. అడ్మిషన్లు జరిగేలోగా పాఠశాలల్లో నెలకొన్న సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. మరమ్మతు పనులను సకాలం పూర్తి చేయాలన్నారు. వేసవిలో నిర్వహించే ఒంటిపూట బడులలో విద్యార్థులకు నీరు, ఇతర సౌకర్యాలలో సమస్యలు రాకుండా చూడాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.

నేడు ఎమ్మెల్యే శింగనమలకు రాక : ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ బుధవారం శింగనమలకు రానునట్లు ఎంపీడీఓ భాస్కర్‌, టీడీపీ మండల కన్వీనర్‌ ఆదినారాయణ తెలిపారు. ఆమె ఉదయం శింగన మలలో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కార్యాక్రమం ప్రారంభిస్తారని తెలిపారు. మధ్యాహ్నం ఎంపీడీఓ కార్యాలయంలో మండల స్థాయి అధికారుల సమావేశానికి ఎమ్మెల్యే హజరువుతారని తెలిపారు. కావున మండలలోని అధికారులు ప్రజాప్రతినిధులు, టీడీపీ శ్రేణులు హజరుకావాలని ఒక ప్రకటనలో తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 08 , 2025 | 11:54 PM