GOD: ఊరూవాడా మార్మోగిన రామనామం
ABN , Publish Date - Apr 07 , 2025 | 12:02 AM
శ్రీరామనవమి వేడుకలను ఆదివారం జిల్లా వ్యాప్తంగా వైభవోపేతంగా నిర్వహించారు. సీతా రాముల కల్యాణోత్సవంతో పాటు పలు ప్రాంతాల్లో ఉట్టికొట్టడం, ఉట్లమాను పరుష, పానకం, వడపప్పు వితరణ, అన్నదానం వంటి కార్యక్ర మాలు నిర్వహించారు. దీంతో ఊరూవాడా రామనామస్మరణ మార్మోగింది. జిల్లాలోని అన్ని రామమందిరాలూ భక్తులతో కిటకిటలాడా యి. జానకి రాముడి కల్యాణాన్ని కనురాలా వీక్షించి అనంత భక్తజనం పులకించి పోయింది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం శ్రీరామనవమి వేడు కలను ప్రజలు ఉత్సాహంగా నిర్వహించారు.

- ఆలయాల్లో వైభవంగా సీతారాముల కల్యాణోత్సవం
అనంతపురం కల్చరల్, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి) : శ్రీరామనవమి వేడుకలను ఆదివారం జిల్లా వ్యాప్తంగా వైభవోపేతంగా నిర్వహించారు. సీతా రాముల కల్యాణోత్సవంతో పాటు పలు ప్రాంతాల్లో ఉట్టికొట్టడం, ఉట్లమాను పరుష, పానకం, వడపప్పు వితరణ, అన్నదానం వంటి కార్యక్ర మాలు నిర్వహించారు. దీంతో ఊరూవాడా రామనామస్మరణ మార్మోగింది. జిల్లాలోని అన్ని రామమందిరాలూ భక్తులతో కిటకిటలాడా యి. జానకి రాముడి కల్యాణాన్ని కనురాలా వీక్షించి అనంత భక్తజనం పులకించి పోయింది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం శ్రీరామనవమి వేడు కలను ప్రజలు ఉత్సాహంగా నిర్వహించారు. జిల్లాకేంద్రంలో పాతూరులోని పురాతన రామస్వామి గుడిలో రాములవారికి విశేష అలంకరణ, అర్చనలు, పూజలు చేశారు. సాయంత్రం నిర్వహించిన ఉట్టికొట్టే కార్యక్రమంలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉట్లమాను ఎక్కేందుకు పోటీపడ్డారు. కార్యక్ర మంలో ఆలయ ఈఓ రామాంజినేయులు, భక్తులు పాల్గొన్నారు. మొదటి రోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్స వాల సందర్భంగా ఆలయ ఆవరణలో ధ్వజారోహణ చేశారు. అనంతరం సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించారు. సాయంత్రం విశేషంగా అలం కరించిన శేషవాహనంపై సీతారాములను ఊరేగించారు. ఆజాద్ నగర్‌లోని దత్తమందిరం వద్ద ధర్మకర్త డాక్టర్ నలుబోలు మధురాయల్ దంపతుల నేతృత్వంలో కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్నదానం ప్రారంభించారు. కోర్టురోడ్డులోని అభయాంజనేయస్వామి దేవా లయంలోనూ సీతారాముల కల్యాణోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహిం చారు. శ్రీనివాసనగర్‌లోని రామాంజ నేయస్వామి దేవాలయం వద్ద ధర్మ కర్త ఆళ్లగడ్డ రాము నేతృత్వంలో కల్యాణోత్సవం నిర్వహించారు. సోమనాథ్‌నగర్ కోదండ రామాలయంలో సీతారాముల కల్యాణోత్సవంతో పాటు అన్నదానం నిర్వహించారు. పాతూరు వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం, విద్యుత్‌నగర్ కాలనీలోని పంచముఖాంజనేయస్వామి దేవాల యం, లక్ష్మీనగర్, విద్యారణ్య నగర్, మారుతీనగర్, రెవెన్యూకాలనీ, అంబేడ్కర్ నగర్, బుడ్డప్పనగర్ తదితర ప్రాంతాల్లోని రామాలయాలన్నిం టిలోనూ శ్రీరామ నవమి వేడుకలను కన్నులపండువగా నిర్వహించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....