District Magistrate : ఏడు వేల కేసుల రాజీనే లక్ష్యం
ABN , Publish Date - Mar 06 , 2025 | 12:52 AM
జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 8న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలతలో ఏడు వేల కేసులను రాజీ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు జిల్లా న్యాయాధికారి శ్రీనివాస్ అన్నారు. తన చాంబర్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి శివప్రసాద్ యాదవ్‌తో కలిసి మాట్లాడారు. చివరి జాతీయ లోక్‌అదాలతలో 6వేలకు పైగా కేసులు పరిష్కారమ ...

జిల్లా న్యాయాధికారి శ్రీనివాస్
అనంతపురం క్రైం, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 8న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలతలో ఏడు వేల కేసులను రాజీ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు జిల్లా న్యాయాధికారి శ్రీనివాస్ అన్నారు. తన చాంబర్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి శివప్రసాద్ యాదవ్‌తో కలిసి
మాట్లాడారు. చివరి జాతీయ లోక్‌అదాలతలో 6వేలకు పైగా కేసులు పరిష్కారమ య్యాయన్నారు. ఇక్కడ తీర్పు సుప్రీం కోర్టు తీర్పుతో సమానమన్నారు. జాతీయ లోక్ అదాలతదే అంతిమ తీర్పు అని, పై కోర్టుకు వెళ్లే అధికారం ఉండదన్నారు. కక్షిదారులు అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టుకోకుండా త్వరగా న్యాయం పొందడానికి ఇదొక మంచి అవకాశమున్నారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల పరిధిలోని కోర్టులలో పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల కేసులను జాతీయ లోక్ అదాలతలో రాజీ చేస్తామన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం...