UPADHI: ‘ఉపాధి’లో అక్రమార్కుల పెత్తనం
ABN , Publish Date - Apr 27 , 2025 | 11:05 PM
మండలంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎవరికి ఉపాధిని కల్పిస్తోందో తెలి యడం లేదు. కూలీలకు ఉపాధి దేవుడికి తెలియాకానీ, అక్రమార్కుల పా లిట కల్పతరువుగా మారింది. తాము చెప్పినట్లు వినకపోతే నాయకుల కు, అధికారులకు చెప్పి మిమ్మల్ని తొలగిస్తామని పలు గ్రామాలలో క్షేత్ర స్థాయి లో ఫీల్డ్ అసిస్టెంట్లను బెదిరిస్తున్నట్లు సమాచారం. ఈ ఒత్తిళ్లతో కొంత మంది పనులకు వెళ్లకున్నా వెళ్లినట్లు మస్టర్లలో పేర్లు ఎక్కించాల్సిన పరి స్థితి నెలకొందని కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు చర్చించుకుంటున్నారు.

- పని చేయకున్నా మస్టర్లలో పేర్లు చేర్చాల్సిందే..?
- ఉపాధి సిబ్బందిపై నేతల ఒత్తిళ్లు..?
గార్లదిన్నె, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): మండలంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎవరికి ఉపాధిని కల్పిస్తోందో తెలి యడం లేదు. కూలీలకు ఉపాధి దేవుడికి తెలియాకానీ, అక్రమార్కుల పా లిట కల్పతరువుగా మారింది. తాము చెప్పినట్లు వినకపోతే నాయకుల కు, అధికారులకు చెప్పి మిమ్మల్ని తొలగిస్తామని పలు గ్రామాలలో క్షేత్ర స్థాయి లో ఫీల్డ్ అసిస్టెంట్లను బెదిరిస్తున్నట్లు సమాచారం. ఈ ఒత్తిళ్లతో కొంత మంది పనులకు వెళ్లకున్నా వెళ్లినట్లు మస్టర్లలో పేర్లు ఎక్కించాల్సిన పరి స్థితి నెలకొందని కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు చర్చించుకుంటున్నారు. సొంత గ్రామాల్లో పనులు కల్పించి కూలీల వలసలు నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. అయితే ఈ పథకాన్ని పలువురు అక్రమ ఆదాయ వనరుగా ఉపయోగిం చుకుంటున్నారని బహిరంగంగా చర్చించుకుంటున్నారు. దీంతో పనులు చేసిన వారికి, చేయని వారికి ఒకే విధమైన కూలీని అధికారులు మంజూరు చేస్తుండడం పలు విమర్శలకు దారితీస్తోంది. పనులు మేము చేయాలి.
. కూలి మీరు తీసుకుంటారా అని పలువురు కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ఇది అధికార పార్టీలోని కొందరు నేతల తీరుకు అద్దం పడుతోంది. గార్లదిన్నె మండలంలో సుమారు 11 వేలకు పైగా జాబ్ కా ర్టులు ఉన్నాయి. ప్రస్తుతం వెయ్యి మంది వరకు కూలీలు పనులు చేస్తున్న ట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అయితే వాస్తవంగా పనులు చేసేది కొందరైతే, పనులు చేయని వారు కొందరనే ఆరోపణలు వినిపిస్తు న్నాయి. అక్రమార్కులకు కొందరు కిందస్థాయి అధికారులు సహకరిస్తుండ డంతోనే ఇలా జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉపాధిలో జరు గుతున్న అక్రమాలపై అధికార పార్టీలో కొందరు నాయకులు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఉపాధిలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు. లేకుంటే ఇటీవల నార్పలలో జరిగినట్లు జరుగుతుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అక్రమాలకు పాల్పడితే ఎవరినీ ఉపేక్షించం - యోగానందరెడ్డి, ఎంపీడీఓ
ఉపాఽధి హామీ పథకంలో అక్రమాలు జరుగుతు న్నట్లు మా దృష్టికి రాలేదు. అక్రమాలకు పాల్పడి తే ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఉపాధి పథకంలో ఎలాంటి అక్రమాలు చోటుచేసు కోకుం డా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పనులకు వచ్చిన వారి పేర్లు మాత్రమే మస్టర్లలో రాయాలి. అదేవిధంగా ఉపాధి పనులను ఎక్కడా యంత్రాలతో చేయరాదు. అలా చేస్తే సంబంధిత సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....