SURVEYORS: సమస్యలు పరిష్కరించాలని సర్వేయర్ల వినతి
ABN , Publish Date - Jun 25 , 2025 | 11:52 PM
తమ సమస్యలు పరిష్కరించాలని గ్రామ సచివాలయ సర్వేయర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మండలంలోని గ్రామ సచివాలయ సర్వేయర్లు బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పిం చారు. జీఓ నెం.1 ప్రకారం హేతుబద్ధీకరణలో భాగంగా మిగులు సిబ్బందిని గ్రామ సర్వేయర్లుగా నివేదిక సమర్పించాలన్నారు.

ఓబుళదేవరచెరువు, జూన 25(ఆంధ్రజ్యోతి): తమ సమస్యలు పరిష్కరించాలని గ్రామ సచివాలయ సర్వేయర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మండలంలోని గ్రామ సచివాలయ సర్వేయర్లు బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పిం చారు. జీఓ నెం.1 ప్రకారం హేతుబద్ధీకరణలో భాగంగా మిగులు సిబ్బందిని గ్రామ సర్వేయర్లుగా నివేదిక సమర్పించాలన్నారు. అలాగే జీఓ నెం. 161 ప్రకారం గ్రేడ్ -3 నుంచి గ్రేడ్ -2గా హోదా కల్పించడంతో పాటు పేస్కేల్‌లో తగిన మార్పు చేయాలన్నారు. అన్ని జిల్లాల్లో సీనియర్ల జాబితాను వెంటనే విడుదల చేయాలన్నారు. అర్హత కలిగినవారికి ఉద్యోగోన్నతి కల్పించాలని, సర్వీస్‌రూల్స్‌లో తగిన మార్పులు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ సర్వేయర్లు వెంకటేష్, బాబ్‌జాన, శ్రీనివాసులు, తదితరులున్నారు.
నల్లచెరువు: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ సర్వేయర్ల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్ రవికుమార్‌కు వారు బుధవా రం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడలో ఆంధ్రప్రదేశ గ్రామ సర్వేయర్ల నిరసనకు పూర్తిగా మద్దతు తెలుపుతున్నామని అన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....