Share News

MLA: ఇంటి పట్టాల కోసం స్థల సేకరణ వేగవంతం చేయండి

ABN , Publish Date - Apr 17 , 2025 | 11:34 PM

మండలం పరిధిలో పేద లకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు స్థల సేకరణను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆమె గురువారం సాయంత్రం మండల తహసీల్దార్‌ మోహన కుమార్‌తో పాటు హౌసింగ్‌ డీఈతో తన క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.

MLA: ఇంటి పట్టాల కోసం స్థల సేకరణ వేగవంతం చేయండి
MLA talking to revenue and housing officials

- ఎమ్మెల్యే పరిటాల సునీత

అనంతపురంరూరల్‌, ఏప్రిల్‌17(ఆంధ్రజ్యోతి): మండలం పరిధిలో పేద లకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు స్థల సేకరణను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆమె గురువారం సాయంత్రం మండల తహసీల్దార్‌ మోహన కుమార్‌తో పాటు హౌసింగ్‌ డీఈతో తన క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. గతంలో పలు హౌి సంగ్‌ లేఅవుట్లలో కొందరు ఎలాంటి అర్హత లేకున్నా, స్థానికంగా లేకున్నాఇళ్ల పట్టాలు తీసుకున్నారని అధికారులు తెలిపారు. వారి లో కొందరు ఇంటి నిర్మాణాలు చేపట్టలేదని, అలాంటి వాటిని గుర్తించి రద్దు చేస్తామని తెలిపారు. దీంతో పాటు పలు గ్రామాల పరిధిలో మొత్తం 30ఎకరాల వరకు సేకరించినట్టు వివరించారు. గత ప్రభుత్వంలో సేకరించి వివాదాల్లో ఉన్న స్థలాలను కూడా క్లియర్‌ చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. త్వరలోనే ప్రభుత్వం ఇళ్ల పట్టాలను మంజూరు చేస్తుందని, అందుకు అనుగుణంగా స్థలం ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ జింకాసూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పామురాయి రఘు, మాజీ మండల కన్వీనర్‌ చల్లా జయకృష్ణ పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 17 , 2025 | 11:34 PM