MLA : నియోజకవర్గం అభివృద్ధికి నిధులివ్వండి
ABN , Publish Date - Apr 19 , 2025 | 12:07 AM
నియోజకవర్గం అభివృద్ధికి నిధులను కేటాయించాలని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలసి ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ జిల్లా ఇనచార్జ్ మంత్రి టీజీ భరతను కోరారు. శుక్రవారం అనంతపురానికి వచ్చిన మంత్రి భరతను ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో మర్వాద పూర్వకంగా కలసి, నియోజకవర్గంలోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

- జిల్లా ఇనచార్జ్ మంత్రిని కోరని ఎమ్మెల్యే శ్రావణిశ్రీ
శింగనమల ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గం అభివృద్ధికి నిధులను కేటాయించాలని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలసి ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ జిల్లా ఇనచార్జ్ మంత్రి టీజీ భరతను కోరారు. శుక్రవారం అనంతపురానికి వచ్చిన మంత్రి భరతను ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో మర్వాద పూర్వకంగా కలసి, నియోజకవర్గంలోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. మంత్రి సానూకులంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడుయాదవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు, సీనియర్ నాయకుడు ముం టిమడుగు కేశవరెడ్డి, నాయకులు తలారి ఆదినారాయణ, రాయల్ మురళి, పసువుల శ్రీరామిరెడ్డి జీసీ రామానాయుడు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....