PROTEST: ఉగ్రదాడిపై నిరసన
ABN , Publish Date - Apr 27 , 2025 | 12:40 AM
ఉగ్రవాదం నశించాలి... హిందూ ముస్లిం బాయి.. బాయి అంటూ.... పహల్గాంలో ఉగ్రవాదుల దా డిని నిరసిస్తూ మాజీసైనికులు శనివారం నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వ హించారు. మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కెప్టెన షేకన్న ఆధ్వర్యంలో ర్యాలీ సాగింది.

అనంతపురం ప్రెస్‌క్లబ్, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): ఉగ్రవాదం నశించాలి... హిందూ ముస్లిం బాయి.. బాయి అంటూ.... పహల్గాంలో ఉగ్రవాదుల దా డిని నిరసిస్తూ మాజీసైనికులు శనివారం నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వ హించారు. మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కెప్టెన షేకన్న ఆధ్వర్యంలో ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ... ఉగ్రవాదాన్ని అణిచివేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అవసరమైతే దేశం కోసం తామంతా ప్రాణాలర్పించడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ ర్యాలీలో సంఘం సభ్యులు పట్నం ఉమామహేశ్వర రావు, రవికుమార్, మహమ్మద్ గౌస్, హుస్సేన, పెంచలయ్య, ఈశ్వరయ్య, రంగారెడ్డి, నాగిరడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం కల్చరల్ : దేశంలోని 140 కోట్లమంది పౌరులు ఒక్క సారి బిగించే పిడికిలికి పాకిస్తాన సాటి కాదని ఐఎంఎం రాష్ట్ర అధ్యక్షుడు మహబూబ్‌బాషా పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు సంతా పంగా ముస్లిం మైనార్టీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శనివారం పాతూరులో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో హాఫీస్ అన్వర్, కరీముల్లా, ఖాజా, అమీర్‌బాషా, ఫిరోజ్, ముస్లీం మతపెద్దలు పాల్గొన్నారు. అలాగే పాతూరు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పాతూరు వాసవీ కన్యాక పరమేశ్వరి ఆలయం నుంచి మార్కెట్ సర్కిల్‌లోని గాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం పహల్గాం ఉగ్రదాడి మృతులకు సంతా పం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హరిశ్చంద్ర ఘాట్ అధ్యక్షుడు తిరువీధుల జగదీష్‌కుమార్, పాతూరు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పిన్ని నాగరత్నం, ఆర్యవైశ్య మహాసభ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధూపకుంట్ల శబరివరప్రసాద్, గర్జాల నాగరాజు, ధూపకుంట్ల సాయినాథ్‌గుప్త తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....