Share News

EMPLOYEES: ప్రమోషన్లు ఇచ్చి బదిలీలు చేపట్టాలి

ABN , Publish Date - Jun 25 , 2025 | 11:48 PM

రాష్ట్ర ప్రభుత్వం సచివాల య ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చి, బదిలీలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. తమ సమస్యలు పరిష్కారించాలంటూ మండలంలోని గ్రామ సచివాలయ ఉద్యోగులు బుధవారం ఆ సంఘం నాయకులతో కలిసి స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ముందుగా ప్లకార్డులు పట్టుకుని పట్టణంలోని కాలేజ్‌ సర్కిల్‌ నుంచి ఎంపీ డీఓ కార్యాలయం వద్దకు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ నిర్వహించారు.

EMPLOYEES: ప్రమోషన్లు ఇచ్చి బదిలీలు చేపట్టాలి
Secretariat employees protesting at the MPDO office

- గ్రామ సచివాలయ ఉద్యోగుల ధర్నా

ధర్మవరంరూరల్‌, జూన 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం సచివాల య ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చి, బదిలీలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. తమ సమస్యలు పరిష్కారించాలంటూ మండలంలోని గ్రామ సచివాలయ ఉద్యోగులు బుధవారం ఆ సంఘం నాయకులతో కలిసి స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ముందుగా ప్లకార్డులు పట్టుకుని పట్టణంలోని కాలేజ్‌ సర్కిల్‌ నుంచి ఎంపీ డీఓ కార్యాలయం వద్దకు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు సర్వీస్‌ రూల్స్‌ కల్పించి, తమ సమస్యలపై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేయాలన్నారు. అదేవిధంగా తొమ్మిది నెలల పెండింగ్‌ అరియన్స తక్షణమే విడుదల చేయాలన్నారు. సచివాలయ శాఖకు చట్టబద్ధత కల్పించి ఆదుకోవాలన్నారు. జాబ్‌చార్ట్‌ ప్రకటించాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్‌లను పరిష్కారించాలని వారు కోరారు. అనంతరం ఎంపీడీఓ సాయిమనోహర్‌కు వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 25 , 2025 | 11:48 PM