BILLS: విద్యుత బిల్లులు కట్టించుకునే వారు లేరా?
ABN , Publish Date - Jun 25 , 2025 | 11:44 PM
ప్రతినెలా 18వ తేదీ లోగా విద్యుత బిల్లులు చెల్లించాలని విద్యుత శాఖ అధికారులు చెబుతున్నారని అయితే ముదిగుబ్బలో విద్యుత బిల్లులు కట్టించుకునేవారు లేకపోవడంతో ఇబ్బం దులు పడుతున్నామని గృహ వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. పలు వురు వినియోగదారులు బుధవారం కూడా విద్యుత సబ్‌స్టేషన వద్ద వేచి చూసి వెనుదిరిగి పోయారు.

- గృహ వినియోగదారుల ఆవేదన
ముదిగుబ్బ, జూన 25(ఆంధ్రజ్యోతి): ప్రతినెలా 18వ తేదీ లోగా విద్యుత బిల్లులు చెల్లించాలని విద్యుత శాఖ అధికారులు చెబుతున్నారని అయితే ముదిగుబ్బలో విద్యుత బిల్లులు కట్టించుకునేవారు లేకపోవడంతో ఇబ్బం దులు పడుతున్నామని గృహ వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. పలు వురు వినియోగదారులు బుధవారం కూడా విద్యుత సబ్‌స్టేషన వద్ద వేచి చూసి వెనుదిరిగి పోయారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తాము ప్రతి నెల విద్యుత బిల్లులు చెల్లించేందుకు కార్యా లయం వద్దకు వస్తున్నామని తెలిపారు. కార్యాలయం వద్ద ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు విద్యుత బిల్లులు స్వీకరించాల్సి ఉందన్నారు. అయితే ఇక్కడ డబ్బులు కట్టించుకునేవారు లేకపోవడంతో రోజూ వేచి చూసి వెనుదిరగాల్సి వస్తోందన్నారు. ఈ నెల కట్టకపోతే మరుసటి నెలలో అదనంగా రూ. 100 బిల్లులో వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఒక నెల బిల్లు సకాలంలో చెల్లించకపోతే విద్యుత కనెక్షన తొలగి స్తారని వివరించారు. విద్యుత శాఖ అధికారులు నిర్లక్ష్యం వల్ల విద్యుత బిల్లులో అదనంగా వచ్చే వంద రూపాయలు ఎవరు చెల్లిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు చర్యలు చేప ట్టి సకాలంలో విద్యుత బిల్లుల స్వీకరించే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంపై ట్రాన్స కో ఏఈ శివతేజను వివరణ కోరగా... పర్మనెంట్ విద్యుత ఆర్సీ లేకపోవడంతో విద్యుత బిల్లులు కట్టించుకునే సమస్య తలెత్తుతోందన్నారు. సమస్యను సంబంధిత అధి కారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. పర్మనెంట్ ఆర్సీని ఏర్పాటుచేస్తే సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....