MLA: ఎమ్మెల్యే పరిటాల సునీత శ్రమదానం
ABN , Publish Date - Apr 27 , 2025 | 12:48 AM
నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే ఎమ్మెల్యే పరిటాల సునీత నసనకోట దుర్గమ్మ ఉత్సవాల ఏర్పాట్ల లో పాల్గొని శ్రమదానం చేశారు. నసనకోటలో వెలసిన దుర్గమ్మ ఉత్సవా లను చాలా సంవత్సరాల తరువాత నిర్వహిస్తున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున అబివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.

రామగిరి, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే ఎమ్మెల్యే పరిటాల సునీత నసనకోట దుర్గమ్మ ఉత్సవాల ఏర్పాట్ల లో పాల్గొని శ్రమదానం చేశారు. నసనకోటలో వెలసిన దుర్గమ్మ ఉత్సవా లను చాలా సంవత్సరాల తరువాత నిర్వహిస్తున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున అబివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో పంచాయతీ వాసులు స్వచ్ఛందంగా పాల్గొంటూ శ్రమదానం చేస్తున్నారు. వారితో పరిటాల సునీత చేయి కలిపి మండుటెండలోనూ ఇటుకలు, ఇసుక మోసి శ్రమదానంలో పాల్గొన్నారు. అనంతరం గ్రామస్థులతో కలిసి గుడి మెట్ల మీదే భోజనం చేశారు. మే 14,15,16 తేదీలలో అమ్మవారి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు.ఇది తన ఊరు అని ఇక్కడ పనులలో పాలు పంచుకోవడం తన బాధ్యత అని ఆమె అన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....