MLA: ఎస్సీ ఉపవర్గీకరణ చారిత్రాత్మక విజయం
ABN , Publish Date - Apr 17 , 2025 | 11:38 PM
ఎస్సీ ఉపవర్గీకరణకు కేబి నెట్ అమోదం తెలుపడం సామాజిక న్యాయానికి చారిత్రాత్మక విజ యమని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. ఆమె గురువారం అనంతపురం లోని క్యాంపు కార్యాలయంలో ఎస్సీ ఉపవర్గీకరణకు కే బినేట్ అమోదంపై ఎస్సీ సంఘాల నాయకులతో సమావేశం నిర్వ హించి, ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.

- ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ హర్షం
శింగనమల, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ ఉపవర్గీకరణకు కేబి నెట్ అమోదం తెలుపడం సామాజిక న్యాయానికి చారిత్రాత్మక విజ యమని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. ఆమె గురువారం అనంతపురం లోని క్యాంపు కార్యాలయంలో ఎస్సీ ఉపవర్గీకరణకు కే బినేట్ అమోదంపై ఎస్సీ సంఘాల నాయకులతో సమావేశం నిర్వ హించి, ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ... సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ రంజన మిశ్రా కమిషన నివేధిక ఆధారంగా, మంత్రుల కమిటి సిఫారసు లతో ఎస్సీ వర్గీకరణకు అమోదం తెలిపిందన్నారు. అన్ని ఎస్పీ ఉపకులా లకు న్యాయం జరగాలనే దీర్ఘకాల సమస్య శాశ్వత పరిష్కారానికి ఈ నిర్ణయం బీజం వేస్తందన్నారు. దళితల ఆత్మగౌరవాన్ని పెంపొందించే ఈ నిర్ణయాన్ని ప్రజలందరూ స్వాగతించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సంఘం నాయకులు చిన్న అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....