MLA: మహానాడుతో వైసీపీ శ్రేణుల మైండ్‌బ్లాక్
ABN , Publish Date - Jun 01 , 2025 | 12:51 AM
మహానాడుతో వైసీపీ శ్రేణుల మైండ్ బ్లాక్ అయిందని, అది చూసి వారికి ఏం చేయాలో తెలి యక వెన్నుపోటు దినోత్సవం అంటూ హడావుడి చేస్తున్నారని ఎమ్మె ల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. తాము జూన 4వ తేదీన ‘విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయన శనివారం మండలంలోని ఎ.నారాయణపురం పంచాయతీ సోమనాథ్‌నగర్ చౌరస్తా నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభించారు.

- ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
అనంతపురం రూరల్, మే 31(ఆంధ్రజ్యోతి): మహానాడుతో వైసీపీ శ్రేణుల మైండ్ బ్లాక్ అయిందని, అది చూసి వారికి ఏం చేయాలో తెలి యక వెన్నుపోటు దినోత్సవం అంటూ హడావుడి చేస్తున్నారని ఎమ్మె ల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. తాము జూన 4వ తేదీన ‘విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయన శనివారం మండలంలోని ఎ.నారాయణపురం పంచాయతీ సోమనాథ్‌నగర్ చౌరస్తా నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభించారు. అనంతరం 41, 50, 44వడివిజన్లలో పింఛన్లు పంపిణీ చేశారు. ఉద్యోగుల మీద ఎవరైనా దురుసుగా వ్యవహరిస్తే ఉపేక్షించేది ఉండ దని, రెండు రోజుల క్రితం సచివాలయం ఉద్యోగిని టీడీపీ స్థానిక నాయకుడు ఫోన్లో దూషించిన సంఘటనపై చర్యలు ఉంటాయన్నారు. నగరపాల క సంస్థ కమిషనర్ బాలస్వామి, తహసీల్దార్ హరికుమార్, టీడీపీ రాష్ట్ర నాయకులు రాయల్ మురళితదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....