MLA: మానసిక రోగి జగన
ABN , Publish Date - Jun 27 , 2025 | 12:08 AM
వైసీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి మా నసిక రోగి అని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. ఎమ్మె ల్యే గురువారం పట్టణంలోని 20వార్డులో మనింటికి మన ఎమ్మెల్యే కార్య క్రమాన్ని నిర్వహించారు. ఆయన ఇంటింటికెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ అధ్యక్షు డు జగన్మోహనరెడ్డి మానసిక రోగంతో బాధపడుతున్నారని, అందుకే టీడీపీ మ్యానిఫెస్టో పట్టుకుని ఇంటింటికెళ్లి అడగాలని వైసీపీ నాయకుల కు చెబుతున్నారన్నారు.

- ఎమ్మెల్యే కందికుంట
- 20వ వార్డులో మనింటికి మన ఎమ్మెల్యే
కదిరి, జూన 26(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి మా నసిక రోగి అని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. ఎమ్మె ల్యే గురువారం పట్టణంలోని 20వార్డులో మనింటికి మన ఎమ్మెల్యే కార్య క్రమాన్ని నిర్వహించారు. ఆయన ఇంటింటికెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ అధ్యక్షు డు జగన్మోహనరెడ్డి మానసిక రోగంతో బాధపడుతున్నారని, అందుకే టీడీపీ మ్యానిఫెస్టో పట్టుకుని ఇంటింటికెళ్లి అడగాలని వైసీపీ నాయకుల కు చెబుతున్నారన్నారు. వారేమో బయటకొచ్చి ఇదేక్కడి ఖర్మ మాకంటు న్నారని తెలిపారు. సంవత్సరం కాలంలోనే తాము పలు సంక్షేమ కార్యక్ర మాలు అమలు చేశామన్నారు. ఏ గడపకు పోయినా తల్లులు సంతోషం గా ఆహ్వానిస్తున్నారని తెలిపారు. ఎక్కడైనా తల్లికి వందనం పడనివారు ఉంటే, సంబంధిత సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఏముఖం పెట్టుకుని వైసీపీ వారు ఇంటింటికి వెళ్తతారని ప్రశ్నించారు. మ్యానిఫెస్తో పెట్టుకుని వైసీపీ నాయకులు ఇంటింటికి రావాలని ఆయన సవాల్ విసిరారు. వార్డుల్లో మురుగునీటి కాలవలు, 11కేవీ వైర్ల సమస్యలు, పింఛన్లు, ఇళ్ల సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మురళీక్రిష్ణ, మున్సిపల్ కమిషనర్ కిరణ్‌కుమార్‌తో పాటు, పలువురు అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....