MLA: యోగాతో మానసిక వికాసం
ABN , Publish Date - Jun 22 , 2025 | 12:00 AM
శారీరక, మానసిక వికాసానికి యోగా తోడ్పడుతుందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. మండలంలోని గూటి బైలు గ్రామంలో వెలసిన ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిమ్మమ్మ మర్రిమాను ప్రాంతంలో శనివారం అంత ర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కంది కుంట హాజరయ్యారు.

నంబులపూలకుంట, జూన 21(ఆంధ్రజ్యోతి): శారీరక, మానసిక వికాసానికి యోగా తోడ్పడుతుందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. మండలంలోని గూటి బైలు గ్రామంలో వెలసిన ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిమ్మమ్మ మర్రిమాను ప్రాంతంలో శనివారం అంత ర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కంది కుంట హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా చేయడం వల్ల దీర్ఘకాలిక జబ్బులు దూరమవుతాయని, మనిషి ఎంతో హుషారుగా ఉండవచ్చన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీడీఓ పార్థసారథి, తహసీల్దార్ దేవేంద్రనాయక్, డిప్యూటీ ఎంపీడీఓ మాధవరెడ్డి, ఎంఈఓలు గోపాల్‌నాయక్, సుబ్బిరెడ్డి, యోగా మాస్టార్లు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....