pole: విద్యుత స్తంభాన్ని ఢీకొన్న లారీ
ABN , Publish Date - Apr 27 , 2025 | 12:52 AM
లారీ ఢీకొనడంతో స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులోని విద్యుత స్తంభం విరిగిపోయిం ది. దీంతో యా ర్డుతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యుత సరఫరా నిలిచిపోయింది. శనివారం ఉదయం 11గంటల సమయంలో చీనీకాయల లోడింగ్ కోసం యార్డులోని చీనీ మార్కెట్‌లోకి లారీ వచ్చింది. లారీని రివర్స్ చేసే క్రమంలో విద్యుత స్తంభాన్ని ఢీ కొట్టింది. స్తంభం విరిగిపోయింది.

అనంతపురం రూరల్, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): లారీ ఢీకొనడంతో స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులోని విద్యుత స్తంభం విరిగిపోయిం ది. దీంతో యా ర్డుతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యుత సరఫరా నిలిచిపోయింది. శనివారం ఉదయం 11గంటల సమయంలో చీనీకాయల లోడింగ్ కోసం యార్డులోని చీనీ మార్కెట్‌లోకి లారీ వచ్చింది. లారీని రివర్స్ చేసే క్రమంలో విద్యుత స్తంభాన్ని ఢీ కొట్టింది. స్తంభం విరిగిపోయింది. విద్యుత తీగలు తెగిపడి కిందికి పడిపోయా యి. అయితే స్థానికంగా ఎవ్వరూ లేకపోవడంతో పెనుప్రమాదమే త ప్పింది. ప్రమాద ఘటన తెలుసుకున్న విద్యుత అధికారులు అక్కడికి చేరుకుని సంబంధిత లారీ డ్రైవర్‌తో స్తంభం, ఇతరాత్రవాటికి అయ్యే ఖర్చు కట్టించి పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఉన్నఫలంగా విద్యుత స్తంభం విరిగిపోవడం, ఆ సమయంలోనే పశువుల వాహనాలు ఒక్కొ క్కటి యార్డులోకి రావడంతో.... యార్డులోని వాహనాలు బయటకు వెళ్లే వీలులేకుండా పోయింది. వాహనాలు క్లియర్ అయ్యేందుకు గం టల సమయం పట్టింది. రైతులు, వ్యాపారులు అసౌకర్యానికి గురయ్యా రు. వాహనాలను నియత్రించడంలో యార్డు అధికారులు, సిబ్బంది నిర్ల క్ష్యంగా వ్యవహరిస్తుండటంతో సమస్యలు తల్తెత్తున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....