Share News

AIDS DAY: ఎయిడ్స్‌ రహిత సమాజాన్ని నిర్మిద్దాం

ABN , Publish Date - Dec 02 , 2025 | 12:08 AM

ఎయిడ్స్‌ రహిత సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి వెంకటేశ్వర్లునాయక్‌ పిలుపునిచ్చారు. సోమవారం ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వైద్యులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు.

AIDS DAY: ఎయిడ్స్‌ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
Officer Venkateshwarlu Nayak inaugurating the rally in the town

హిందూపురం, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): ఎయిడ్స్‌ రహిత సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి వెంకటేశ్వర్లునాయక్‌ పిలుపునిచ్చారు. సోమవారం ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వైద్యులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. న్యాయాధికారి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఎయిడ్స్‌ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అంటు వ్యాధి కాదన్నారు. అయితే వ్యాధిపట్ల చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ అన్నపూర్ణ న్యాయవాదులు శ్రీనివాసరెడ్డి, రవిచంద్ర, వైద్యులు పాల్గొన్నారు. వాసవ్య మహిళా మండలి, కుశాల్‌ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో అప్పులకుంట వద్ద ఏంజెల్‌ ఐటీఐ కళాశాలలో ఎయిడ్స్‌పై అవగాహన నిర్వహించారు. డాక్టర్‌ సల్మా పాల్గొని ఎయిడ్స్‌ అంటే ఏంటి, ఎలా వ్యాపిస్తుంది తదితర వాటిపై వివరించారు.

సోమందేపల్లి (ఆంధ్రజ్యోతి): ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్య సిబ్బంది సోమవారం పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం నుంచి ర్యాలీ చేపట్టారు. వైద్యాధికారి ఆయిషా ప్రజలకు ఎయిడ్స్‌పట్ల అవగాహన కల్పించారు. వైద్యులు అశ్వినికుమార్‌, పర్యవేక్షకులు రవీంద్ర, రత్నమ్మ, మాలతీదేవి అశ్విని, పాల్గొన్నారు.


చిలమత్తూరు(ఆంధ్రజ్యోతి): ఎయిడ్స్‌ మహమ్మారిని అరికడదామని డాక్టర్‌ లావన్య పిలుపునిచ్చారు. సోమవారం తన సిబ్బందితో కలిసి ఎయిడ్స్‌పై మండల కేంద్రంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. డాక్టర్‌ రోజా, సీహెచఓ జయచంద్రకుమార్‌, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

మడకశిరటౌన, (ఆంధ్రజ్యోతి): ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలో సోమవారం ఫోర్డ్‌ స్వచ్ఛంద సంస్థ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సంస్థ డైరెక్టర్‌ బదిరీష్‌, మేనేజర్‌ అశ్వత్థనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

గోరంట్ల, (ఆంధ్రజ్యోతి): ఎయిడ్స్‌ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా సో మవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పాలసముద్రం గ్రామంలోని కేంద్రీయ విద్యాలయంలో ప్రిన్సిపాల్‌ క్రిష్ణారావు ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఏస్కేడీఆర్‌ జూనియర్‌, ఎస్‌పీవీఎం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ భక్తవత్సలం, ఎనఎ్‌సఎ్‌స పీఓలు ఆజాద్‌, బాలమోహన ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

పెనుకొండ(ఆంధ్రజ్యోతి): ఎయిడ్స్‌ రహిత సమాజస్థాపనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సుదర్శన అన్నారు. సోమవారం ఎయిడ్స్‌ నివారణ దినోత్సవాన్ని రెడ్‌రిబ్బనక్లబ్‌, ఎనఎ్‌సఎ్‌స వలంటీర్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. అధ్యాపకులు, విద్యార్థులు బ్యానర్లు పట్టి నినాదాలు చేస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎయిడ్స్‌ నిర్మూలనపై ప్రతిజ్ఞ చేశారు. స్థానిక పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీకళాశాలలో ఎనఎ్‌సఎ్‌స ఆధ్వర్యంలో ఎయిడ్స్‌ దినోత్సవాన్ని నిర్వహించారు. అధ్యాపకులు బషీర్‌అహ్మద్‌, మూర్తి, రంగనాథ్‌, రామారావు, హారిక, శ్రవంతి, నోడల్‌ ఆఫీసర్‌జయప్రకాశ, పీఓలు శ్రీలేఖ, రవికుమార్‌, ప్రిన్సిపాల్‌ జయప్ప, ఐక్యూ కోఆర్డినేటర్‌ యశోదరాణి, అద్యాపకులు ప్రతాప్‌, రామన్న, కాంతారావు, పాల్గొన్నారు.

Updated Date - Dec 02 , 2025 | 12:08 AM