Home » Penukonda
రాజీమార్గం ఎంతో ఉత్తమమని హిందూపురం అదనపు జిల్లా న్యాయాధికారి కంపల్లె శైలజ అ న్నారు. శనివారం జాతీయ మెగా లోక్ అదాలత నిర్వహించారు. 245 కేసులు నాలుగు బెంచీల ద్వారా పరిష్కరించారు.
అభివృద్ధి బాటలో సోమందేపల్లి మండలం పరుగులు పెడుతోంది. మంత్రి సవిత పెనుకొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విరివిగా చేపడుతున్నారు.
కాయదశలో ఉన్న కందిపంటకు రైతులు తప్పనిసరిగా సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఏవో విజయభారతి తెలిపారు. మంగళవారం సూచించారు. కేతగానిచెరువు, రెడ్డిపల్లి గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు.
గోరంట్ల మండలంలో అనువైన చోట యాదవ కల్యాణమండపానికి స్థలం కేటాయిస్తామని మంత్రి సవిత హామీ ఇచ్చారు. మంగళవారం రాష్ట్ర యాదవ కార్పొరేషన డైరెక్టర్ కేశవయ్య గోరంట్లకు చెందిన యాదవ సంఘం నాయకులు మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు.
మండలపరిధిలోని గుత్తివారిపల్లి వద్దనున్న సాగర్ సిమెంటు గోడౌనపై విజిలెన్స ఎనఫోర్స్‌మెంట్ అధికారులు సోమవారం దాడిచేసి గోడౌనను సీజ్ చేశారు. గుత్తివారిపల్లి వద్ద కొన్నేళ్లుగా కర్నూలుకు చెందిన మహేష్ అనే వ్యక్తి సాగర్ అనే సిమెంట్ ఫ్యాక్టరీ ద్వారా దిగుమతులు, ఎగుమతులు సాగిస్తున్నారు.
పెనుకొండ సమీపంలో ఐదు ఎకరాల్లో గిరిజన గురుకుల బాలికల సంక్షేమ వసతి గృహాన్ని నిర్మిస్తామని మంత్రి సవిత అన్నారు. సోమవారం పట్టణంలోని వసతిగృహాన్ని ఆమె ద్విచక్రవాహనంలో వెళ్లి తనిఖీ చేశారు.
శ్రీసత్యసాయి జిల్లాలో జిల్లాలో జరిగిన రాబరీ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు వ్యక్తులు సూరత్ నుంచి బెంగుళూరుకు ఇన్నోవా కారులో తరలిస్తున్న హవాలా డబ్బును.. కొందరు దుండుగులు అడ్డుకుని కాజేశారు.
మండలం మాగేచెరువు వీఆర్‌ఓ సోమశేఖర్‌నాయక్ తమ భూములు అమ్మి డబ్బుల విషయంలో మో సం చేశాడని గోరంట్ల మండలం కొడిగేపల్లి పంచాయతీకి చెందిన రైతులు తహసీల్దార్ కార్యాలయంలో డీటీ రెడ్డిశేఖర్‌కు ఫిర్యాదు చేశారు.
ఎయిడ్స్ రహిత సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని సీనియర్ సివిల్ న్యాయాధికారి వెంకటేశ్వర్లునాయక్ పిలుపునిచ్చారు. సోమవారం ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వైద్యులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు.
చేనేత కార్మికులకు నేతన్న నేస్తం అమలు చేయాలని ఏపీ చేనేత సంఘం జిల్లా నాయకుడు శీల నారాయణస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.