ORANGE: చీనీ రైతులకు లాభం చేకూర్చేందుకు ప్రభుత్వం కృషి
ABN , Publish Date - Apr 17 , 2025 | 11:43 PM
చీనీ రైతులకు లాభం చేకూర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఉద్యాన శాఖాధికారి రత్నకుమార్ పే ర్కొన్నారు. గురువారం స్థానిక రైతు సేవా కేంద్రంలో ఉద్యాన రైతులకు, ఏపీఎంఐపీలోని ఎఫ్సిఓలకు డ్రోన సర్వేపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ముకుందాపురం గ్రా మంలో చీనీ తోటలను సందర్శించారు.

- ఉద్యాన శాఖాధికారి రత్నకుమార్
గార్లదిన్నె, ఏఫ్రిల్ 17(ఆంధ్రజ్యోతి): చీనీ రైతులకు లాభం చేకూర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఉద్యాన శాఖాధికారి రత్నకుమార్ పే ర్కొన్నారు. గురువారం స్థానిక రైతు సేవా కేంద్రంలో ఉద్యాన రైతులకు, ఏపీఎంఐపీలోని ఎఫ్సిఓలకు డ్రోన సర్వేపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ముకుందాపురం గ్రా మంలో చీనీ తోటలను సందర్శించారు. ఈ సందర్భంగా ఉద్యాన శాఖ అధికారి రత్నకుమార్ మాట్లాడుతూ... పండ్లతోటల రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం బబవిస్తోంద న్నారు. అందులో భాగంగా బత్తాయి (చీనీ) పండ్లతోటల రైతులకు డ్రోన సహాయం ము ఖ్యమని గుర్తించిందన్నారు. మండలంలోని ము కుందాపురం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా చేసి రాష్ట్రంలో మొదటి గ్రామంగా గుర్తించిందన్నారు. సిబ్బంది క్షేత్రస్థాయిలో బత్తాయి తోటలను సందర్శించి పండ్లతోటలకు జీఎస్ ట్రాకింగ్ చేసి ప్రభుత్వానికి పంపారన్నారు. శుక్రవారం కూడా క్షేత్రస్థాయిలో తిరిగి జీపీఎస్ ట్రాకింగ్ చేస్తామ న్నారు. బత్తాయి తోటల్లో జీఎస్ ద్వారా ట్రాకింగ్ చేసి రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచ నలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రాప్తాడు ఏపీఎంఐపీ మైక్రో ఇరిగేషన అధికా రులు మధు, గణేష్, నాగార్జున, రైతు సేవా కేం ద్రం ఎఫ్‌సీఓలు, రఘునాథ్‌రెడ్డి, ఏపీ ఎమ్‌ఐపీ ప్రాజెక్టు డైరెక్టర్, జిల్లా ఉద్యానవన అధికారి ఫిరోజ్‌ఖాన జూమ్ మీటింగ్ ద్వారా వీక్షించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....