SCHOOL: వసతుల్లేని ప్రభుత్వ బడులు
ABN , Publish Date - Jun 25 , 2025 | 11:38 PM
ప్రైవేటు బడుల కంటే ప్రభుత్వ బడులు మిన్నగా ఉండా లని గత వైసీపీ ప్ర భుత్వం నాడు-నేడు ప నులు చేపట్టింది. రూ. కోట్లు వేచ్చించి పాఠ శాల భవనాలు నిర్మించి నా, నీటి వసతి లేక పోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా రు. మరుగు దొడ్లు నిరుపయోగంగా మారాయి. మండలంలో ఏడు జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలు, ఆరు ప్రాథమికోన్నత, 40 ప్రాథమిక పాఠశాలలు ఉన్నా యి.

- నీరు, మురుగుదొడ్లు లేక విద్యార్థుల అవస్థలు
నల్లమాడ, జూన 25 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు బడుల కంటే ప్రభుత్వ బడులు మిన్నగా ఉండా లని గత వైసీపీ ప్ర భుత్వం నాడు-నేడు ప నులు చేపట్టింది. రూ. కోట్లు వేచ్చించి పాఠ శాల భవనాలు నిర్మించి నా, నీటి వసతి లేక పోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా రు. మరుగు దొడ్లు నిరుపయోగంగా మారాయి. మండలంలో ఏడు జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలు, ఆరు ప్రాథమికోన్నత, 40 ప్రాథమిక పాఠశాలలు ఉన్నా యి. అలాగే ఎస్టీ బాలుర ఆశ్రమ పాఠశాల, అంబేడ్కర్ గురుకుల బాలికల పాఠశాల, కసూ ్తర్బా గాంధీ బాలికా విద్యాలయం ఉన్నాయి ఇందులో నల్లమాడ, రెడ్డిపల్లి, పాత బత్తలపల్లి, సి. బండవాండ్లపల్లి, ఎర్రవంకపల్లి, దొన్నికోట, కురమాలల్లో జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలన్నింటిలో పాఠశాల భవనాలు బాగా ఉన్నాయే కానీ, అరకొర నీటితో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. నీరు ఉ న్నా మరుగుదొడ్లు, మూత్రశాలలకు కొన్ని పాఠశాలలో సరిపడే పైపులైన ఏర్పాటు చేయలేదు. మరి కొన్నిపాఠశాలలో పైపులైన్లు ఉన్నా నీరు అరకొరగా ఉంది. నీటి సమస్యతో అధిక శాతం పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నా నిరుపయోగంగా మారాయి.
పలు పాఠశాలల్లో ఇలా...
మండలంలోని పలు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఇలాంటి దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలాఉంటే అధిక శాతం పాఠశాలల్లో శుద్ధ జల ప్లాంట్లు పనిచేయడం లేదు. మధ్యాహ్నం భోజనానికి పలువురు విద్యార్థులు ఇళ్ల వద్ద నుంచి బాటిళ్లలో నీరు తెచ్చుకుంటుండగా, కొంత మంది పాఠశాలలో అరకొరగా వస్తున్న నీటినే తాగుతున్నట్లు తెలుస్తోంది. నల్లమాడ జిల్లా పరిషత ఉన్నతపాఠశాలలో ఉపాధ్యాయులు సొంత డబ్బుతో విద్యార్థుల కోసం తాగునీటి క్యాన్లును తెప్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాఠశాలలో గతంలో ఏర్పాటు చేసిన శుద్ధజల ప్లాంటు కొద్దిరోజులు మాత్రమే పనిచేసింది. పలుమార్లు మరమ్మతులు చేయించినా ప్రయోజ నం లేదని సమాచారం. అదే పాఠశాలకు ప్రభుత్వం ఇటీవల నూతనంగా శుద్ధజల ప్లాంటును అందించింది. దాన్ని బిగించారేకానీ, విద్యుత కనెక్షన ఇవ్వలేదు. అలాగే సి. బండవాండ్లపల్లి జిల్లాపరిషత ఉన్నపాఠశాలలోని బోరుబావిలో అరకొరగా నీరు వస్తున్నట్లు ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఈ నీరు విద్యార్థులకు సరిపోవడంలేదు. రెండు, మూడు మార్లు విద్యుత మోటార్ మరమ్మతులు చేయించినా నీటి కోరత తీరడంలేదంటున్నారు. పంచాయతీ బోరునుంచి పాఠశాలలోకి పైపులైన ఏర్పాటు చేసి, నీటిని సరఫరా చేస్తే నీటి సమస్య తీరుతుందని ఉపాధ్యాయులు అంటున్నారు. ఇక దొన్నికోట జిల్లా పరిషత ఉన్నతపాఠశాలలో మ రుగుదొడ్లు శిథిలా వస్థకు చేరుకున్నాయి. ఇటీవల మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూ రు కాగా, గోడవల వరకు మాత్రమే నిర్మించారు. అలాగే దొన్నికోట ప్రాథ మిక పాఠశాల ఆవరణంలో ఉన్న చేతిపంపు నీరే ఆ పాఠశాలకు గతిగా మారాయి. పంచాయతీ బోరునుంచి పాఠశాలకు కనెక్షన ఇచ్చినా, మరమ్మ తులు ఉండడంతో నీరు రావడంలేదని ఉపాధ్యాయులు తెలుపుతున్నారు, చేతిపంపు నీటిని భోజనం సమయంలో శుభ్రం చేసుకోవడానికి వినియో గిస్తున్నారు. శుద్ద జల ప్లాంటు ఉన్నా మరమ్మత్తులకు గురైంది. విద్యార్థు లు ఇంటినుంచి తాగునీటిని తెచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా కొత్తపల్లి తండా, తిప్పయ్యగారిపల్లి, కుటాలపల్లి ఎస్సీకాలనీ ప్రాథమిక పాఠశాల, చిల్లగోర్లపల్లి, కమ్మవారిపల్లి తదితర ప్రాథమిక పాఠశాలలో నీటి సమస్య నెలకుంది. ఇలాంటి పాఠశాలలను అధికారులు పరిశీలించి, సమస్యలు పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
కొన్నిపాఠశాలల్లో నీటి సమస్య ఉంది- వేమనారాయణ, ఎంఈఓ, నల్లమాడ
మండలంలో కొన్ని పాఠశాలల్లో నీటి సమస్య ఉన్నది వాస్తవమే. అలాగే మరుగుదొడ్లు, మూత్రశాలల సమస్యలు ఉన్నాయి. ఆయా పాఠశాలలను, వాటిలోని సమస్యలను గుర్తిస్తాం. పంచాయతీ అఽధికారులతో చర్చించి నీటి సమస్య పరిష్కారానికి కృషిచేస్తాం.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....