MLA: గుడ్ ప్రైడే రోజు క్రైస్తవులకు గుడ్ న్యూస్ : ఎమ్మెల్యే
ABN , Publish Date - Apr 19 , 2025 | 12:12 AM
గుడ్ ప్రైడే రోజు సీఎం చంద్రబాబునాయుడు క్రైస్తవులకు గుడ్‌న్యూ అందిం చారని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం గుడ్ ప్రైడే సందర్భంగా అనంతపురం అర్బన టీడీపీ కార్యాలయంలో టీడీపీ క్రిస్టియన సెల్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామి దాస్, పలువురు పాస్టర్లు ఎమ్మెల్యేతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

అనంతపురం అర్బన, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి) : గుడ్ ప్రైడే రోజు సీఎం చంద్రబాబునాయుడు క్రైస్తవులకు గుడ్‌న్యూ అందిం చారని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం గుడ్ ప్రైడే సందర్భంగా అనంతపురం అర్బన టీడీపీ కార్యాలయంలో టీడీపీ క్రిస్టియన సెల్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామి దాస్, పలువురు పాస్టర్లు ఎమ్మెల్యేతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతేడాది మే నుంచి నవంబరు దాకా పెండింగ్‌లోని పాస్లర్ల గౌరవవేతనాన్ని సీఎం చంద్రబాబునాయుడు విడుదల చేయడం సంతోషకరమ న్నారు. త్వరలోనే సబ్సిడీ రుణాలు, విదేశీ విద్య, జెరూసలేం యా త్ర తదితర పథకాల అమలు చేస్తారన్నారు. కార్యక్రమంలో నా యకులు గంగారామ్, హరికృష్ణ, పాస్టర్లు కృపాదాస్, జీవరత్నం, ఉదయ్, దానియేలు, ఇస్సాకు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....