GOOD FRIDAY: భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే ప్రార్థనలు
ABN , Publish Date - Apr 19 , 2025 | 12:02 AM
గుడ్‌ఫ్రైడేని పుర స్కరించుకుని శుక్రవారం జిల్లావ్యాప్తంగా ప్రార్థనలను ఘనంగా నిర్వ హించారు. మానవాళికోసం యేసుక్రీస్తు తన ప్రాణాన్ని త్యజించిన శుభ శుక్రవారం సందర్భంగా వాడవాడలా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని క్రీస్తు మందిరాలన్నీ కిటకిటలాడాయి. నగరం లోని అరవిందనగర్‌లో ఉన్న సీయస్‌ఐ హోలి ట్రినిటి చర్చిలో ప్రెస్‌బిటర్, సీయస్‌ఐ హెచ్‌టీసీ అనంతపురం డివిజనల్ చైర్మన్ పీడీఎస్‌జే బెనహర్ బాబు ఆధ్వర్యంలో శుభ శుక్రవారపు ఆరాధనను నిర్వహించారు.

అనంతపురం కల్చరల్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): గుడ్‌ఫ్రైడేని పుర స్కరించుకుని శుక్రవారం జిల్లావ్యాప్తంగా ప్రార్థనలను ఘనంగా నిర్వ హించారు. మానవాళికోసం యేసుక్రీస్తు తన ప్రాణాన్ని త్యజించిన శుభ శుక్రవారం సందర్భంగా వాడవాడలా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని క్రీస్తు మందిరాలన్నీ కిటకిటలాడాయి. నగరం లోని అరవిందనగర్‌లో ఉన్న సీయస్‌ఐ హోలి ట్రినిటి చర్చిలో ప్రెస్‌బిటర్, సీయస్‌ఐ హెచ్‌టీసీ అనంతపురం డివిజనల్ చైర్మన్ పీడీఎస్‌జే బెనహర్ బాబు ఆధ్వర్యంలో శుభ శుక్రవారపు ఆరాధనను నిర్వహించారు. రెవరెండ్ రెవరెండ్ ఐజక్ వరప్రసాద్ ముఖ్యవక్తగా హాజరై క్రీస్తు బోధించిన ఏడు అంశాలపై ఆధ్యాత్మిక సందేశమిచ్చారు. అనంతరం క్రైస్తవ సంఘం సభ్యులు బైబిల్‌లో ఒక్కో సందేశ సారాంశాన్ని వివరించారు. అలాగే సప్త గిరి సర్కిల్‌లోని ఎస్‌ఐయూ టౌన్ కాంగ్రినేషనల్ చర్చి ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో క్రైస్తవులతో కిటకిటలాడింది. రెవరెండ్ సంపత విజయ్‌కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ప్రార్థనలకు బెంగళూరుకు చెందిన రెవరెండ్ స్టీఫెన బాబ్ హాజరై యేసు జీవిత ఇతివృత్తాన్ని బోధించారు. అదే విధంగా సంఘసభ్యులు బైబిల్ సారాంశాలను చదివి వినిపించారు. అనం తరం గాయనీగాయకులు యేసుక్రీస్తు గీతాలను ఆలపించారు. రామచంద్ర నగర్‌లోని కార్మెల్‌మాత చర్చిలో పాస్టర్ జోసెఫ్, నగర శివారులోని క్రీస్తు విశ్వాసుల సంఘం చర్చిలో పాస్టర్ నతానియేల్ ప్రత్యేక ప్రార్థనలు ని చేశారు. కోర్టురోడ్డులోని గాస్పెల్‌హాల్ చర్చి, అంబేడ్కర్ నగర్‌లోని యేసు క్రీస్తు ప్రార్థనామందిరం, కళాకారుల కాలనీలోని రేమా చర్చితోపాటు అన్ని ప్రాంతాలోని చర్చిల్లో గుడ్‌ఫ్రైడే ప్రార్థనలను ఘనంగా నిర్వహించారు.
కనగానపల్లి: మండల వ్యాప్తంగా గుడ్‌ప్రైడే వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. సీఎనకోట చర్చిలో ఏసుక్రీస్తు శిలువను ఊరేగిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్బంగా ఆయా చర్చిల్లో ఫాదర్లు ఏసుక్రీస్తు సందేశాలను వివరించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....