GOD : జగదభిరాముడికి గరుడవాహన సేవ
ABN , Publish Date - Apr 11 , 2025 | 12:18 AM
మొదటిరోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో నిర్వహిస్తున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజున గురువారం రాములవారు గరుడవాహనంపై ఊరేగుతూ దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం సీతారాముల మూలవిరాట్లకు వివిధ అభిషేకాలు, సహస్రనామార్చన నిర్వహించారు.

అనంతపురం కల్చరల్, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): మొదటిరోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో నిర్వహిస్తున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజున గురువారం రాములవారు గరుడవాహనంపై ఊరేగుతూ దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం సీతారాముల మూలవిరాట్లకు వివిధ అభిషేకాలు, సహస్రనామార్చన నిర్వహించారు. సాయంత్రం స్వామి వారిని వెంకటేశ్వరస్వామిగా అలంకరించి ప్రత్యేక రథంలోని గరుడవాహనంపై ఆశీనులను చేసి ఊరేగించారు. రాత్రికి స్వామివార్ల కు దశహారతులు సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ శోభ, భక్తమండలి నరేంద్ర చౌదరి, శ్రీనివాసులు చౌదరి, జిజే వేణు, ప్రధానార్చకుడు నరసింహశాసి్త్ర, పరమేష్, భక్తులు పాల్గొన్నారు.
నేడు సీతారాముల కల్యాణం
శింగనమల, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): ఒంటిమెట్ల తరహాలో శుక్రవారం శింగనమలలో సీతారాముల కల్యాణం నిర్వహిస్తున్నట్లు గ్రామపెద్దలు తెలిపారు. ప్రసిద్ధి చెందిన శింగనమల ఆత్మసీతారామ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామినవమి తరువాత వచ్చే పౌర్ణమి రోజు సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. ఈ సంద ర్భంగా కల్యాణ మండపాన్ని ముస్తాబు చేశారు. శుక్రవారం రాత్రి 8.30 గంటకు తులాలగ్నంలో స్వామి వారికి కల్యాణం నిర్వహిస్తున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ కుటుంబ స భ్యులు సీతారాములకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అంద జేస్తారని తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....