DHARNA: న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Apr 22 , 2025 | 11:50 PM
ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతన సవరణ చేయాలని, ఇతర న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కమ్యూనిటీ హెల్త్ అధికారులు ఆందోలన చేపట్టారు. నిరసనలో భాగంగా మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా కొనసాగించారు.

- సీహెచఓల డిమాండ్ ఫ కలెక్టరేట్ వద్ద ధర్నా
అనంతపురం టౌన, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి) : ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతన సవరణ చేయాలని, ఇతర న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కమ్యూనిటీ హెల్త్ అధికారులు ఆందోలన చేపట్టారు. నిరసనలో భాగంగా మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా కొనసాగించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు గణేష్, ప్రి యాంక, సధీర్‌గౌరీ తదితరులు మాట్లాడుతూ 2019నుంచి ఎనహెచఎం ద్వారా ఎంపికైన గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నా మన్నారు. ప్రజారోగ్య పరిరక్షణలో కీలకంగా వ్యవహరిస్తున్నామన్నారు. కానీ తమక ఉద్యోగ భద్రత లేదని, వేతనాలు పెంచకపోగా సకాలంలో చెల్లిం చడం లేదన్నారు. కనీస పనికి కనీస వేతనం ఇవ్వకుండా చిన్నచూపు చూస్తున్నారని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం తమ న్యా యమైన డిమాండ్లు పరిష్కరించాలని వేడుకుంటున్నామని పేర్కొన్నా రు. ఇలాగే నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రం మొత్తం ఆందోలనలు చేపడతామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు సువర్ణ, సత్యమయ్య, లక్ష్మీనారాయణ, నాగరాజు, వందలమంది సీహెచఓలు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....