WATER: పోలేపల్లిలో తాగునీటికి కటకట
ABN , Publish Date - Apr 27 , 2025 | 11:13 PM
మండలంలోని పోలేపల్లి బీసీ కాలనీలో తీవ్రమైన తాగునీటి ఎద్దడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. గ్రామంలో ఆరు పంచాయతీ బోర్లు ఉండగా అందులో మూడు పూర్తిగా ఎండిపోయాయి. మిగిలిన మూడు బోర్లలో భూగర్భజలాలు తగ్గడంతో నీరు తక్కువగా వస్తోంది. గ్రామంలోని బీసీకాలనీలో దాదా పు 200 ఇళ్ల వరకు ఉండగా వారికి తాగునీరే రావడం లేదు. వారు వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లి వ్యాన్లలో, ట్యాంకర్ల ద్వారా నీరు తెచ్చు కుంటున్నారు.

రామగిరి, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): మండలంలోని పోలేపల్లి బీసీ కాలనీలో తీవ్రమైన తాగునీటి ఎద్దడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. గ్రామంలో ఆరు పంచాయతీ బోర్లు ఉండగా అందులో మూడు పూర్తిగా ఎండిపోయాయి. మిగిలిన మూడు బోర్లలో భూగర్భజలాలు తగ్గడంతో నీరు తక్కువగా వస్తోంది. గ్రామంలోని బీసీకాలనీలో దాదా పు 200 ఇళ్ల వరకు ఉండగా వారికి తాగునీరే రావడం లేదు. వారు వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లి వ్యాన్లలో, ట్యాంకర్ల ద్వారా నీరు తెచ్చు కుంటున్నారు. ట్యాంకర్లు, వాహనాలులేని వారు కొళాయిల వద్దే పడి గాపులు కాస్తూ నీటిని తెచ్చుకుంటున్నారు. చేతనైనవారు ద్విచక్రవాహ నాలు, సైకిళ్లలో నీటిని తెచ్చుకుంటున్నారు. ఉగాది పండుగ నుంచి తాగునీటితో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అధికారులకు,. స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియజేసినా, ఎవరూ పట్టించుకోవడంలేదని వారు వాపోయారు. రెండు రోజుల తరువాత తాగునీటి కోసం ఎంపీడీఓ కార్యాలయం లేదా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....