WATER : తాగునీటి సమస్య పరిష్కరించాలి
ABN , Publish Date - Feb 28 , 2025 | 12:18 AM
మండలంలోని చక్రాయపేట పంచాయతీ శివపురం గ్రామంలోని ఎస్పీ కాలనీలో తాగునీటి సమస్య పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేశారు. అధికారులు, ప్రజా ప్రతి నిధులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్న స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు గురువారం గ్రామంలోని కొత్త బోరుబావి వద్ద ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు.

వంద గజాల విద్యుత వైరు ఇచ్చేందుకు వందరోజులా..?
శివపురం ఎస్సీ కాలనీ వాసుల ఆందోళన
శింగనమల, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చక్రాయపేట పంచాయతీ శివపురం గ్రామంలోని ఎస్పీ కాలనీలో తాగునీటి సమస్య పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేశారు. అధికారులు, ప్రజా ప్రతి నిధులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్న స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు గురువారం గ్రామంలోని కొత్త బోరుబావి వద్ద ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... మండలంలో నాలుగేళ్లుగా సిక్స్‌వే రోడ్డు పనులు జరుగుతున్నాయని తెలిపా రు. ఈ క్రమంలో దాదాపు నాలుగైదు నెలల కిందట గ్రామం వద్ద ఉన్న ఎస్సీ కాలనీకి తాగు నీరు సరఫరా చేసే పైపులు రోడ్డు పనుల్లో ధ్వంసం అయ్యాయని, దీంతో కాలనీకి నీరు రావడంలేదన్నారు. దీంతో కొత్తగా బోరుబావి తవ్వించి, మోటార్ బిగించి కాలనీకి పైపు లైన వేయాలని పలు మార్లు అధికారులు, ప్రజా ప్రతినిధులకు విన్నవించామని తెలిపారు. ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. ఆర్డీటీ వారు స్పందించి, కాలనికి తాగునీటి సమస్య పరిష్కారం కోసం దాదాపు మూడు నెలల కిందట కొత్తగా బోరు తవ్వించి, మోటారు బిగించారని తెలిపారు. అయితే మోటా రుకు కరెంటు కనెక్షన ఇవ్వాలని కోరుతున్నా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యుత అధికారులు, సిక్స్‌వే రోడ్డు కాంట్రాక్టర్ ఒకరి మీద ఒకరు చొప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. మోటారుకు విద్యుత కనెక్షన ఇచ్చేందుకు కేవలం వంద గజాల వైరు అవసరమని, అది ఇచ్చేందుకు వంద రోజుల నుంచి వేడు కుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి కోసం వ్యవసాయ బోర్లు వద్దకు వెళ్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి మోటర్‌కు విద్యుత కనిక్షన ఇచ్చి , తమకు నీరు సరఫరా చేయాలని మహిళలు కోరారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....