Share News

WATER: తాటిమాను గుంతలో తాగునీటి ఎద్దడి

ABN , Publish Date - Jun 08 , 2025 | 01:09 AM

మండలంలోని తాటిమాను గుంత గ్రామంలో 20రోజులకు పైగా తాగునీటి ఎద్దడి నెలకొందని, పట్టిం చుకునే వారు లేరని గ్రామస్థులు వాపోతున్నారు. గ్రామంలో వంద కుటుం బాలున్నాయి. అందరూ వ్యవసాయ పనులు, కూలి పనులకు వెళ్లేవారే. గ్రామంలోని రక్షిత తాగునీటి బోరు మోటారు దాదాపు ఇరవై రోజుల క్రితం కాలిపోయింది. బోరులో నుంచి మోటారు, పైపులు బయటకు తీసి 20 రోజులకు పైగా అవుతోంది.

WATER: తాటిమాను గుంతలో తాగునీటి ఎద్దడి
Villagers catching water at an agricultural bore

నంబులపూలకుంట, జూన 7(ఆంధ్రజ్యోతి): మండలంలోని తాటిమాను గుంత గ్రామంలో 20రోజులకు పైగా తాగునీటి ఎద్దడి నెలకొందని, పట్టిం చుకునే వారు లేరని గ్రామస్థులు వాపోతున్నారు. గ్రామంలో వంద కుటుం బాలున్నాయి. అందరూ వ్యవసాయ పనులు, కూలి పనులకు వెళ్లేవారే. గ్రామంలోని రక్షిత తాగునీటి బోరు మోటారు దాదాపు ఇరవై రోజుల క్రితం కాలిపోయింది. బోరులో నుంచి మోటారు, పైపులు బయటకు తీసి 20 రోజులకు పైగా అవుతోంది. దీంతో తాగునీటికి, పశువుల దాహార్తి తీ ర్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు తెలుపుతున్నా రు. అధికారులు, పాలకులు పట్టించుకోవడంలేదని ఆవేదన చెందారు. దీంతో కరెంటు వచ్చినప్పుడు గ్రామానికి చెందిన లక్ష్యయ్య, నరసింహులు అనే రైతుల వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లి బిందెలతో నీటిని తెచ్చుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. ఆ సయమంలో కూలికి వెళ్లినా, పఽశువులను మేత తొలుకెళ్లినా తాగునీటి కోసం తిప్పలు తప్పవంటున్నారు. దీంతో ఇంటికొక మనిషిని కేటాయించి అరకొరగా నీటిని తెచ్చుకుని కాలం వెళ్ల దీస్తున్నామంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 08 , 2025 | 01:09 AM