Share News

SCHOOL: అసంపూర్తి నిర్మాణాలతో ఇబ్బందులు

ABN , Publish Date - Jun 27 , 2025 | 12:00 AM

మండలంలోని జౌకల కొత్తపల్లి లో జిల్లా పరిషత ఉన్నత పాఠశాల విద్యార్థులు అసౌకర్యాలతో ఇబ్బంది పడుతున్నారు ఈ పాఠశాలలో దాదాపు 80మందికి పైగా చదువుతున్నారు. ఈ పాఠశాలకు గత వైసీపీ ప్రభుత్వంలో నాడు - నేడు పథకం కింద మూడుఅదనపు తరగతి గదులు, వంటగదితో పాటు మరుగుదొడ్లను మం జూరు చేశారు. పనులు మొదలు పెట్టి గోడల వరకు నిర్మించారు. అక్కడి తో పనులు అగిపోయాయి.

SCHOOL:  అసంపూర్తి నిర్మాణాలతో ఇబ్బందులు
Halted classrooms

- నిలిచిపోయిన తరగతి గదులు, మరుగుదొడ్లు, వంట గది

- అవస్థలు పడుతున్న విద్యార్థులు, భోజన ఏజెన్సీ

అమడగూరు, జూన 26(ఆంధ్రజ్యోతి): మండలంలోని జౌకల కొత్తపల్లి లో జిల్లా పరిషత ఉన్నత పాఠశాల విద్యార్థులు అసౌకర్యాలతో ఇబ్బంది పడుతున్నారు ఈ పాఠశాలలో దాదాపు 80మందికి పైగా చదువుతున్నారు. ఈ పాఠశాలకు గత వైసీపీ ప్రభుత్వంలో నాడు - నేడు పథకం కింద మూడుఅదనపు తరగతి గదులు, వంటగదితో పాటు మరుగుదొడ్లను మం జూరు చేశారు. పనులు మొదలు పెట్టి గోడల వరకు నిర్మించారు. అక్కడి తో పనులు అగిపోయాయి. ఫలితంగా విద్యార్థులు అసౌకర్యాలతో ఇబ్బం దులు పడుతున్నారు. తరగతి గదుల సంగతి ఎలా ఉన్నా... మరుగుదొడ్ల నిర్మాణం పనులు ఆగిపోయాయి. దీంతో విద్యార్థినులు అవస్థలు పడాల్సి వస్తోంది. అలాగే వంటగది విషయంలోనూ సమస్యగానే ఉంది. మధ్యాహ్న భోజన ఏజెన్సీ వారు ఇంటి వద్దే భోజనం వండి పాఠశాలకు మోసుకురావాల్సి వస్తోంది. ఆయా గదుల పనులు సకాలంలో పూర్తి అయి ఉంటే, పిల్లలకు చాలా ప్రయోజనకరంగా ఉండేది. ప్రభుత్వం నిధులిచ్చినా పనులు అసంపూర్తిగా మిగిలిపోవడంతో అసౌకర్యాల నడుమ విద్యార్థులు చదువుకోవాల్సిన దుస్థితి ప్రస్తుతం నెలకొంది. దీనికి తోడు చేపట్టాల్సిన పనులకు నిధులున్నా, అయితే పాఠశాల కమిటీ సభ్యులు ఐక్యతతో ముందుకు రావాల్సి ఉంది. పాఠశాల కమిటీ సయోధ్యతో అంగీకారం తెలి పితే పనులు పూర్తిచేయడానికి అవకాశముంది. అధికారులు, పాఠశాల ప్రఽధానోపాధ్యాయులు, కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేసి, విద్యార్థు లకు సరైన సదుపాయాలు కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.


ఇంటి వద్దే వండి తెస్తున్నాం- మాధవి, మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు

పాఠశాలలో దాదాపు 80మంది విద్యార్థులు ఉన్నారు. రోజూ మా ఇంటి వద్దే వండి భోజన పదార్థాలను నెత్తిన పెట్టుకుని పాఠశాలకు మోసుకొని వస్తున్నాం. తెచ్చిన అన్నం, కూరల విద్యార్థులకు వడ్డిస్తున్నాం. ఇందు కోసం మూడుమార్లు పాఠశాలకు, ఇంటికి తిరగాల్సి వస్తోంది. దీంతో చాల ఇబ్బంది పడుతున్నాం. పాఠశాలలో వంటగది పూర్తి చేస్తే, విద్యార్థులకు మధ్యాహ్నభోజనం అక్కడే వండి వడ్డించడం సులువుగా ఉంటుంది.

కమిటీ సభ్యులు ముందుకు రావాలి- బడా రఘునాథరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు

పాఠశాల కమిటీ సభ్యులు ముందుకొస్తే వంటగది, మరుగుదొడ్లు, నిర్మించేందుకు వీలు కలుగుతుంది. తద్వారా విద్యార్థులకు సౌకార్యాలుండేలా చూస్తాం. వాటి నిర్మాణానికి కావలసిన నిధులు ఉన్నాయి. కమిటీ సభ్యులతో చర్చించి పూర్తి చేస్తాం.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 27 , 2025 | 12:02 AM