Share News

SPORTS: జాతీయ స్థాయి పోటీలకు ధర్మవరం విద్యార్థిని

ABN , Publish Date - Nov 11 , 2025 | 12:04 AM

ఎస్‌జీఎఫ్‌ రాష్ట్రస్థాయి కురాషా పోటీల్లో ధర్మవరం విద్యార్థిని సింధు ప్రతిభ కనబరచి జా తీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్టు జీవీఈ జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల హెచఎం సుమన తెలిపారు. ఇటీవల అనంత పురం సమీపంలోని మాంటి స్సోరి పాఠశాలలో నిర్వహించిన ఎస్‌జీఎఫ్‌ రాష్ట్రస్థాయి కురాషా పోటీల్లో తమ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న సింధు పాల్గొన్నారు.

SPORTS: జాతీయ స్థాయి పోటీలకు ధర్మవరం విద్యార్థిని
School HM, Coach congratulating the selected student Sindhu

ధర్మవరం, నవంబరు 10 ఆంఽధ్రజ్యోతి): ఎస్‌జీఎఫ్‌ రాష్ట్రస్థాయి కురాషా పోటీల్లో ధర్మవరం విద్యార్థిని సింధు ప్రతిభ కనబరచి జా తీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్టు జీవీఈ జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల హెచఎం సుమన తెలిపారు. ఇటీవల అనంత పురం సమీపంలోని మాంటి స్సోరి పాఠశాలలో నిర్వహించిన ఎస్‌జీఎఫ్‌ రాష్ట్రస్థాయి కురాషా పోటీల్లో తమ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న సింధు పాల్గొన్నారు. అండర్‌-14 మైనస్‌ 32 కేజీ విభాగంలో ప్రతిభను కనబరచి బంగారు పతకం సాధించినట్లు తెలిపారు. ఆ విద్యార్థిని ఉత్తరప్రదేశలో డిసెంబరు 15 నుంచి 18వ తేదీ వరకు జరిగే జాతీ యస్థాయి పోటీలకు ఎం పిక కావడం తమ పాఠ శాలకు గర్వకారణ మన్నా రు. దీంతో ఆ విద్యార్థినిని హెచఎంతో పాటు పీఈ టీ స్వరూప, సరళ, కోచలు ఇనాయాతబాషా, నవ్యశ్రీ అభినందించారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Nov 11 , 2025 | 12:05 AM