Share News

WATER : తాగునీటికి కటకట..!

ABN , Publish Date - Jun 08 , 2025 | 01:01 AM

మండలంలోని నడిమిగ డ్డపల్లి ఎస్సీకాలనీలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. కాల నీలో సుమారు 30 కుటుం బాలు జీవనం సాగిస్తున్నా యి. అయితే కాలనీకి సం బంధించిన పంచాయతీ బో రు మరమ్మతులకు గురి కా వడంతో తాగునీటికి కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ప డుతున్నారు.

WATER : తాగునీటికి కటకట..!
Repaired panchayat bore

- మరమ్మతులకు గురైన పంచాయతీ బోర్లు

- ఇబ్బందులు పడుతున్న నడిమిగడ్డపల్లి ఎస్సీ కాలనీ వాసులు

ధర్మవరం రూరల్‌, జూన 7(ఆంరఽధజ్యోతి): మండలంలోని నడిమిగ డ్డపల్లి ఎస్సీకాలనీలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. కాల నీలో సుమారు 30 కుటుం బాలు జీవనం సాగిస్తున్నా యి. అయితే కాలనీకి సం బంధించిన పంచాయతీ బో రు మరమ్మతులకు గురి కా వడంతో తాగునీటికి కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ప డుతున్నారు. ప్రస్తుతం గ్రామంలో నుంచి తాగునీరు అరకొరగా వస్తుండటంతో... సమీప వ్యవ సాయ పొలాలకు వెళ్లి తెచ్చుకుంటున్నామని కాలనీ ప్రజలు వాపోతున్నా రు. పంచాయతీ బోరుకు మరమ్మతులు చేయించాలని అధికారులకు ఎన్ని సార్లు తెలిపినా పట్టించుకోవడం లేదని గగ్గోలు పెడుతున్నారు. బోరు నుంచి నీరు పుష్కలంగా వస్తుండేదని, మరమ్మతులకు రావడంతో నీటి సమస్య తలెత్తిందంటున్నారు. అధికారులు స్పందించి పంచాయతీ బోరుకు మరమ్మతులు చేయించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు.

రెండు రోజుల్లో పరిష్కారిస్తాం - సాయిమనోహర్‌, ఎంపీడీఓ

రెండు రోజుల్లో బోరు రిపేరీ చేయించి నడిమి గడ్డపల్లి ఎస్సీకాలనీలో తాగునీటి సమస్య పరి ష్కారిస్తాం. ఏ గ్రామంలో తాగునీటి సమస్య ఉండకుండా చర్యలు చేపట్టాం. పంచాయతీ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం.

Updated Date - Jun 08 , 2025 | 01:03 AM