SEEDS : రైతులకు అండగా కూటమి ప్రభుత్వం
ABN , Publish Date - Nov 25 , 2025 | 12:17 AM
కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉంటుందని నగర పంచాయతీ చైర్మన నరసింహరాజు అన్నారు. సోమవారం పట్టణంలోని రైతు సేవా కేంద్రంలో 80 శాతం సబ్సిడీతో ఉలవల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
మడకశిరటౌన, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉంటుందని నగర పంచాయతీ చైర్మన నరసింహరాజు అన్నారు. సోమవారం పట్టణంలోని రైతు సేవా కేంద్రంలో 80 శాతం సబ్సిడీతో ఉలవల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రైతులు ఆధార్‌కార్డు, పట్టాదార్ పాసుపుస్తకం, సెల్‌ఫోన తీసుకెళ్లాలన్నారు. పట్టణ అధ్యక్షుడు నాగరాజు, ఏఓ తిమ్మప్ప, క్లస్టర్ ఇనచార్జి బేగార్లపల్లి రవి పాల్గొన్నారు.
మడకశిర రూరల్ (ఆంధ్రజ్యోతి): రైతులకు 80 శాతం సబ్సిడీతో ఉలవలు పంపిణీ చేస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి తిమ్మప్ప తెలిపారు అన్నీ రైతు సేవా కేంద్రాల్లో ఉలవలు అందుబాటులో ఉన్నాయన్నారు. 10 కేజీల ప్యాకేట్ రూ.560 అని, 80 శాతం సబ్సిడీ పోను కేవలం రూ.112లకే 10 కేజీల ఉలవల ప్యాకేట్ లభిస్తుందన్నారు. సోమవారం కల్లుమర్రి రైతు సేవా కేంద్రంలో రైతులకు ఉలవలు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.
గుడిబండ(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం సబ్సిడీతో రైతులకు అందిస్తున్న ఉలవలను సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ మండల కన్వీనర్ లక్ష్మీనరసప్ప కోరారు. మద్దనకుంట గ్రామంలో సోమవారం రైతు సేవా కేంద్రంలో రైతులకు ఉలవలుపంపిణీ చేశారు. మైనార్టీ నాయకుడు షబ్బీర్, ప్రకాశ, ఏఈఓ అపర్ణ, వెటర్నరీ సహాయకుడు రమేష్, రైతులు దాసప్ప, మూడ్లిగిరియప్ప, నారాయణప్ప పాల్గొన్నారు.