TDP: సీఎం చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం
ABN , Publish Date - Apr 27 , 2025 | 11:09 PM
చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అందించే భృతిని రూ. 20వేలకు పెంచి నందుకు టీడీపీ బెస్త సాధికార సమితి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. టీడీపీ బెస్త నాయకులు మేక చంద్రబాబు, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కుళ్లాయప్ప, బెస్త సాధికార సమితి రాష్ట్ర కమిటీ సభ్యులు చేపల హరి తదితరులు ఆదివారం టీడీపీ జిల్లా కార్యాలయం వద్ద సీఎం చంద్రబాబునాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

అనంతపురం అర్బన, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అందించే భృతిని రూ. 20వేలకు పెంచి నందుకు టీడీపీ బెస్త సాధికార సమితి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. టీడీపీ బెస్త నాయకులు మేక చంద్రబాబు, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కుళ్లాయప్ప, బెస్త సాధికార సమితి రాష్ట్ర కమిటీ సభ్యులు చేపల హరి తదితరులు ఆదివారం టీడీపీ జిల్లా కార్యాలయం వద్ద సీఎం చంద్రబాబునాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశకు జైకొట్టారు. టీడీపీతోనే బెస్తలకు అన్ని రకాలుగా న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మేక షణ్ముక, బెస్త నారాయణస్వామి, పవన, జస్వంత వ్యాస్, వెంకటేష్, అశోక్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....