CELEBRATIONS: తల్లికి వందనంపై సంబరాలు
ABN , Publish Date - Jun 17 , 2025 | 12:31 AM
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలుచే యడంతో విద్యార్థుల తల్లుల ముఖాల్లో ఆనందం వెల్లివి రిస్తోందని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పేర్కొన్నారు. దీంతో సోమ వారం మండల కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవనకళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.

- సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం
బుక్కపట్నం/గాండ్లపెంట/ తనకల్లు, జూన 16 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలుచే యడంతో విద్యార్థుల తల్లుల ముఖాల్లో ఆనందం వెల్లివి రిస్తోందని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పేర్కొన్నారు. దీంతో సోమ వారం మండల కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవనకళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. గాండ్లపెంట మండల వ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులకు వారి తల్లుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.13వేల వంతున ప్రభుత్వం జమ చేసింది. దీంతో గాండ్లపెంట ఉన్నతపాఠశాలలో సీఎం చంద్రబాబు, ఎమ్మె ల్యే కందికుంట వెంకటప్రసాద్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. తల్లికి వందనం కార్యక్రమం విజయవంతం కావ డంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం తనకల్లు మండలంలోని ఈతోడు పాఠశాలలో విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి, సంబరాలు చేసుకున్నారు.