POET : అనంత సాహితీ ప్రకాశం ఆశావాది
ABN , Publish Date - Feb 18 , 2025 | 12:23 AM
పద్మశ్రీ డాక్టర్ ఆశావాది ప్రకాశరావు అనంత సాహితీ ప్రకాశం అని జనప్రియ కవి ఏలూరి యంగన్న పేర్కొన్నారు. ఆశావాది ప్రకాశరావు తృతీయ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం మొదటిరోడ్డులోని పొట్టి శ్రీరాములు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు వెలుగు సాహిత్య సామాజిక సేవాసంస్థ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల లు వేసి నివాళులర్పించారు.

జనప్రియ కవి ఏలూరి యంగన్న
అనంతపురం కల్చరల్, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి) : పద్మశ్రీ డాక్టర్ ఆశావాది ప్రకాశరావు అనంత సాహితీ ప్రకాశం అని జనప్రియ కవి ఏలూరి యంగన్న పేర్కొన్నారు. ఆశావాది ప్రకాశరావు తృతీయ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం మొదటిరోడ్డులోని పొట్టి శ్రీరాములు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు వెలుగు సాహిత్య సామాజిక సేవాసంస్థ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల లు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఆశావాది శశాంకమౌళి, తెలుగు వెలుగు సాహితీ సామాజిక సేవాసంస్థ అధ్యక్షుడు టీవీ రెడ్డి, నాయకులు అల్తాఫ్, సుబ్బరాయుడు, కేఎల్‌ఎన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం సెంట్రల్: తెలుగు సాహిత్య మేటి పద్మశ్రీ ఆశా వాది ప్రకాష్‌రావు అని ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శశాంకమౌళి పే ర్కొన్నారు. ఆశావాది ప్రకాష్‌రావు వర్ధంతిని పురస్కరించుకుని కే ఎస్‌ఆర్ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో సోమవారం సాహితీ కార్య క్రమాన్ని నిర్వహించారు. ఆయన చి త్రపటానికి నివాళులర్పించారు. అధ్యాపకులు ఆశావాది సుధామ వంశీ, వసంతగౌరి పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....