Share News

Special Trains: హైదరాబాదు- కన్యాకుమారి మధ్య 8 ప్రత్యేక రైళ్లు

ABN , Publish Date - Jun 27 , 2025 | 01:03 PM

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాదు-కన్యాకుమారి(Hyderabad-Kanniyakumari) మధ్య తిరువణ్ణామలై మీదుగా 8 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో శ్రీధర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Special Trains: హైదరాబాదు- కన్యాకుమారి మధ్య  8 ప్రత్యేక రైళ్లు

తిరుపతి: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాదు-కన్యాకుమారి(Hyderabad-Kanniyakumari) మధ్య తిరువణ్ణామలై మీదుగా 8 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో శ్రీధర్‌(South Central Railway CPRO Sridhar) ఒక ప్రకటనలో తెలిపారు. తిరువణ్ణామలై పుణ్యక్షేత్రానికి పెరుగుతున్న రద్దీని తెలుసుకొని వీటిని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. జూలై 2 నుంచి 25వ తేది వరకు రాకపోకలు సాగిస్తాయన్నారు.


nani5.2.jpg

హైదరాబాదులో ఈ ప్రత్యేక రైలు(07230) జూలై 2న (బుధవారం) సాయంత్రం 5.20 గంటలకు బయలు దేరి సికింద్రాబాదు, నల్లగొండ(Secundrabad, Nalgonda), నడికుడి, గుంటూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి(Renigunta, Tirupati), పాకాల, చిత్తూరు, కాట్పాడి, తిరువణ్ణామలై మీదుగా కన్యాకుమారికి 3వ తేది అర్ధరాత్రి దాటాక 2.30 గంటలకు చేరుకొంటుందని తెలిపారు. 4వ తేది (శుక్రవారం) ఉదయం 5.15 గంటలకు ఈ ప్రత్యేక రైలు(07229) బయలుదేరి వచ్చిన మార్గంలో ప్రయాణిస్తూ 5వ తేది మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాదు చేరుకొంటుందన్నారు.


nani5.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి.

నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

‘స్థానికం’లో బీసీ రిజర్వేషన్ల పెంపు..

Read Latest Telangana News and National News

Updated Date - Jun 27 , 2025 | 01:03 PM