Share News

రిపబ్లిక్‌డే పరేడ్‌కు సర్వాయిపేట విద్యార్థిని

ABN , Publish Date - Dec 30 , 2024 | 11:03 PM

మండలంలోని సర్వాయిపేట గ్రామా నికి చెందిన గుగ్లోత్‌ రుచిత జనవరి 26న ఢిల్లీలోని ఎర్రకోటలో నిర్వ హించే రిపబ్లిక్‌ డే పరేడ్‌ వేడుకలకు ఎంపికైంది. కోటపల్లి మోడల్‌ స్కూల్‌, కళాశాలలో ఇంటర్‌ వరకు చదువుకున్న రుచిత ప్రస్తుతం శాతావాహన విశ్వ విద్యాలయం పరిధిలోని కరీంనగర్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో డిగ్రీ చదువుతోంది.

రిపబ్లిక్‌డే పరేడ్‌కు సర్వాయిపేట విద్యార్థిని

కోటపల్లి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): మండలంలోని సర్వాయిపేట గ్రామా నికి చెందిన గుగ్లోత్‌ రుచిత జనవరి 26న ఢిల్లీలోని ఎర్రకోటలో నిర్వ హించే రిపబ్లిక్‌ డే పరేడ్‌ వేడుకలకు ఎంపికైంది. కోటపల్లి మోడల్‌ స్కూల్‌, కళాశాలలో ఇంటర్‌ వరకు చదువుకున్న రుచిత ప్రస్తుతం శాతావాహన విశ్వ విద్యాలయం పరిధిలోని కరీంనగర్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. విద్యార్థిని ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటరీగా అనేక క్యాంపుల్లో పాల్గొనగా ఎర్రకోటలో నిర్వహించే పరేడ్‌కు రాష్ట్రం నుంచి 8 మంది ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీ ర్లు ఎంపిక కాగా శాతావాహన యూనివర్సిటీ నుంచి గుగ్లోత్‌ రుచిత ఎంపిక య్యారు.

రుచిత ఎంపికపై శాతావాహన యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ఉమేష్‌ కుమార్‌ విద్యార్థిని అభినందించారు. రిపబ్లిక్‌ డే వేడుకల అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో జరిగే తేనేటి విందులో పాల్గొననుంది. మారుమూల గ్రామా నికి చెందిన గుగ్లోత్‌ దేశ్యానాయక్‌-లలిత రైతు కుటుంబానికి చెందిన గిరిజన బిడ్డ ఎంపిక కావడంపై గ్రామస్థులు మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయులు, విద్యార్థులు, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కుమార్‌ సంతోషం వ్యక్తం చేశారు.

Updated Date - Dec 30 , 2024 | 11:03 PM