Share News

Warner-Rajamouli: వార్నర్‌కు రాజమౌళి శాపం.. హీరోలనే అనుకుంటే క్రికెటర్‌నూ వదల్లేదు

ABN , Publish Date - Nov 27 , 2024 | 08:05 PM

Warner-Rajamouli: ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్ ఇప్పుడు తీవ్ర నిరాశలో ఉన్నాడు. అతడి అభిమానులు కూడా ఫుల్ డిజప్పాయింట్ అవుతున్నారు. ఒకటి అనుకుంటే, ఇంకొకటి అయిందని బాధపడుతున్నారు. అయితే వార్నర్ పరిస్థితికి ఏస్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళినే కారణమని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ అంటున్నారు.

Warner-Rajamouli: వార్నర్‌కు రాజమౌళి శాపం.. హీరోలనే అనుకుంటే క్రికెటర్‌నూ వదల్లేదు

IPL 2025 Mega Auction: ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్ ఇప్పుడు తీవ్ర నిరాశలో ఉన్నాడు. అతడి అభిమానులు కూడా ఫుల్ డిజప్పాయింట్ అవుతున్నారు. ఒకటి అనుకుంటే, ఇంకొకటి అయిందని బాధపడుతున్నారు. అయితే వార్నర్ పరిస్థితికి టాలీవుడ్ ఏస్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళినే కారణమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జక్కన్న వల్లే డేవిడ్ భాయ్‌కు ఈ సిచ్యువేషన్ వచ్చిందని అంటున్నారు. రాజమౌళి శాపం తగిలే కంగారూ బ్యాటర్ ఇలా అయిపోయాడని చెబుతున్నారు. అసలు ఆ శాపం ఏంటి? దాని వల్ల వార్నర్‌కు కలిగిన నష్టం ఏంటనేది ఇప్పుడు చూద్దాం..


మళ్లీ రిపీట్

ఫిల్మ్ ఇండస్ట్రీలో సెంటిమెంట్లు ఎక్కువగా పాటిస్తారనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాంబినేషన్స్ మొదలుకొని చాలా వాటిల్లో దీన్ని చూడొచ్చు. అయితే కొన్ని సెంటిమెంట్లు అందర్నీ భయపెడతాయి. అందులో రాజమౌళి శాపం ఒకటి అని చెబుతుంటారు. ఎంతో మంది బిగ్‌స్టార్స్‌తో కలసి పని చేశారాయన. అయితే జక్కన్న దర్శకత్వంలో నటించిన హీరోల తదుపరి సినిమాలు ఫెయిల్ అవడం పక్కా అనే ఓ సెంటిమెంట్ ఉంది. రాజమౌళి శాపం వల్లే ఇలా జరుగుతోందని పుకార్లు వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు వార్నర్ విషయంలోనూ ఇదే రిపీట్ అయిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. హీరోలనే అనుకుంటే ఇప్పుడు క్రికెటర్‌నూ వదల్లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.


మీమ్స్ వైరల్

వార్నర్‌కు రాజమౌళి శాపం తగిలిందని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ అంటున్నారు. రీసెంట్‌గా జరిగిన ఐపీఎల్-2025 మెగా ఆక్షన్‌లో డేవిడ్ భాయ్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోవడానికి ఇదే కారణమని చెబుతున్నారు. వార్నర్ కోసం మంచి పోటీ ఉంటుందని.. అతడిపై కోట్ల వర్షం కురుస్తుందని అనుకుంటే జక్కన్న శాపంతో డేవిడ్ భాయ్‌ను ఎవరూ కొనుక్కోలేదని వింత కామెంట్స్ చేస్తున్నారు. గతంలో జక్కన్నతో కలసి వార్నర్ ఓ యాడ్‌లో నటించాడని గుర్తుచేస్తున్నారు. రాజమౌళితో సినిమా చేయాలనే ఆలోచనతో ఈ యాడ్ వచ్చిందని.. అతడితో పని చేయడం వల్లే ఆక్షన్‌లో ఆసీస్ బ్యాటర్‌కు నిరాశ ఎదురైందని అంటున్నారు. దీనికి సంబంధించిన కొన్ని మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


శాపం నిజమేనా?

రాజమౌళితో వర్క్ చేసిన తర్వాత ప్రభాస్, రామ్ చరణ్‌లు ఫెయిల్యూర్స్ చూశారని నెటిజన్స్ గుర్తుచేస్తున్నారు. ‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్ చేసిన ‘సాహో’ పరాజయం పాలవడం, ‘ఆర్ఆర్ఆర్’ అనంతరం రామ్ చరణ్ ‘ఆచార్య’తో ఫెయిల్యూర్ చూశాడని చెబుతున్నారు. ఇప్పుడు వార్నర్ విషయంలోనూ ఇదే జరిగిందని.. రాజమౌళి శాపం మరోమారు నిజమైందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం అలాంటిదేమీ లేదని అంటున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’తో బ్లాక్‌బస్టర్ కొట్టాడని గుర్తుచేస్తున్నారు. వార్నర్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడని.. అతడికి బదులు యంగ్‌స్టర్స్‌ను తీసుకుంటే బెటర్ అనే ఉద్దేశంతోనే ఫ్రాంచైజీలు అలా వ్యవహరించి ఉండొచ్చని కామెంట్స్ చేస్తున్నారు.


Also Read:

ఒకే ఓవర్‌లో 29 పరుగులు.. హార్దిక్ విధ్వంసాన్ని చూసి తీరాల్సిందే

వార్నర్‌కు రాజమౌళి శాపం.. హీరోలనే అనుకుంటే క్రికెటర్‌నూ

సిరాజ్‌పై ప్రేమ చంపుకోని ఆర్సీబీ

For More Sports And Telugu News

Updated Date - Nov 27 , 2024 | 09:39 PM