క్రికెట్‌కు అశ్విన్ అల్విదా.. అతడికి వచ్చే పెన్షన్ ఎంతంటే..
ABN, Publish Date - Dec 18 , 2024 | 01:36 PM
భారత క్రికెటర్, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు.

ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు అతడు ప్రకటించాడు.

సారథి రోహిత్ శర్మ సమక్షంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో అతడు ఈ అనౌన్స్మెంట్ ఇచ్చాడు.

భారత జట్టు తరఫున ఇన్నేళ్లు ఆడినందుకు గర్వంగా ఉందన్నాడు.

అయితే ఆటకు అశ్విన్ అశ్విదా చెప్పేయడంతో అతడి రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి చర్చ జరుగుతోంది.

రిటైర్మెంట్ ఇచ్చిన అశ్విన్‌కు అందే పెన్షన్, ఇతర బెనిఫిట్స్ గురించే తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు క్రికెట్ లవర్స్.

మన దేశంలో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో కనీసం 25 మ్యాచులు ఆడిన వారికి భారత క్రికెట్ బోర్డు పెన్షన్ సౌకర్యం కల్పిస్తోంది.

25 నుంచి 49 ఫస్ట్‌క్లాస్ మ్యాచులు ఆడిన వారికి నెల నెలా రూ.30 వేల పెన్షన్ లభిస్తుంది.

అదే 50 నుంచి 74 మ్యాచులు ఆడిన వారికి రూ.45 వేల పింఛన్ ఇస్తారు.

75కి పైగా మ్యాచులు ఆడిన వాళ్లకు ప్రతి నెలా రూ.52,500 పెన్షన్ ఇస్తారు.

ఆ లెక్కన 106 టెస్టులు ఆడిన అశ్విన్‌కు రూ.52 వేల వరకు పెన్షన్ అందివ్వనుంది భారత క్రికెట్ బోర్డు.

అయితే దీనిపై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకున్నాకే క్లారిటీ రానుంది.
Updated at - Dec 18 , 2024 | 01:47 PM