Manish Sisodia: ఎన్నికల్లో పోటీకి ఆర్థిక సాయం కోరిన మాజీ ఉప ముఖ్యమంత్రి
ABN , Publish Date - Dec 30 , 2024 | 09:27 PM
ప్రజలు ఇచ్చే ప్రతి రూపాయి ఢిల్లీలో ఉద్యోగ, విద్యా పురోగతికి ఉపయోగపడుతుందని మీడియాతో మాట్లాడుతూ సిసోడియా తెలిపారు. 2025 ఫిబ్రవరి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.

న్యూఢిల్లీ: ఆప్ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia) 'ఆన్‌లైన్ క్రౌడ్ ఫండింగ్ ఫ్లాట్‌ఫాం'ను సోమవారంనాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు ఆర్థిక సాయం అందించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
LG VK Saxena: కేజ్రీవాల్ 'తాత్కాలిక సీఎం' వ్యాఖ్యలపై అతిషికి ఎల్జీ లేఖ
''జాంగ్‌పుర నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈరోజు నేను ఆన్‌లైన్ క్రౌడ్ ఫండింగ్ ఫ్లాట్‌ఫాంను ప్రారంభించాను. నేను ప్రతిసారి ప్రజల ఆర్థిక సహకారంతోనే పోటీ చేస్తూ వచ్చాను. విజయాలు సాధించాను. ఈసారి కూడా ఎన్నికల్లో పోటీకి ఆర్థిక సాయం కోరుతున్నాను'' అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ప్రజలు ఇచ్చే ప్రతి రూపాయి ఢిల్లీలో ఉద్యోగ, విద్యా పురోగతికి ఉపయోగపడుతుందని మీడియాతో మాట్లాడుతూ ఆయన తెలిపారు. 2025 ఫిబ్రవరి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.
సిసోడియా ప్రస్తుతం పట్పర్ గంజ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఈసారి జంగ్‌పుర నుంచి పోటీలో ఉన్నారు. మద్యం కుంభకోణంలో 17 నెలల పాటు జైలు శిక్ష అనుభవించిన సిసోడియా కొద్దికాలం క్రితం బెయిలుపై విడుదలయ్యారు.
ఇవి కూడా చదవండి:
Rohingyas in Delhi: రోహింగ్యాలపై కేజ్రీ, కేంద్ర మంత్రి లడాయి
Prashant Kishore: పరీక్ష రద్దు చేయాలని విద్యార్థుల ఆందోళన.. కీలక నేత అరెస్ట్
Kumbh Mela 2025: మహా కుంభమేళాకు.. రూ.7,500 కోట్లు
Read More National News and Latest Telugu News