Share News

YCP MLC Jayamangala : జనసేనలోకి జయమంగళ

ABN , Publish Date - Dec 31 , 2024 | 03:25 AM

వైసీపీ ఎమ్మెల్సీ, కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ జనసేన పార్టీ తీర్థం తీసుకున్నారు.

YCP MLC Jayamangala  : జనసేనలోకి జయమంగళ

  • గంజి చిరంజీవి దంపతులు కూడా.. పవన్‌కల్యాణ్‌ సమక్షంలో చేరిక

కైకలూరు, మంగళగిరి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎమ్మెల్సీ, కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ జనసేన పార్టీ తీర్థం తీసుకున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను, మాజీ ఎమ్మెల్సీ బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం మంగళగిరిలోని జనసేన రాష్ట్రపార్టీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జయమంగళకు పవన్‌ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ నేత, ఆప్కో మాజీ చైర్మన్‌ గంజి చిరంజీవి, రాధ దంపతులు కూడా జనసేనలో చేరారు. వైసీపీలో తన పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కార్యక్రమంలో ఏపీఎంఎ్‌సఐడీసీ చైర్మన్‌ చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2024 | 03:25 AM