Deputy CM Pawan Kalyan : చిన్నారిని ఆదుకుంటా..
ABN , Publish Date - Dec 24 , 2024 | 03:18 AM
తలసేమియాతో బాధ పడుతున్న చిన్నారిని ఆదుకుంటానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.

కంకిపాడు, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): తలసేమియాతో బాధ పడుతున్న చిన్నారిని ఆదుకుంటానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. గొడవర్రులో రోడ్డు పనులు పరిశీలించేందుకు ఆయన కాన్వాయ్‌లో వెళ్తుండగా.. రోడ్డు పక్కన చిన్నారి తొండమల్లి హేశ్విత (5)తో తల్లి ఆయన కోసం వేచి చూస్తోంది. అది గమనించిన ఆయన.. కాన్వాయ్‌ను ఆపి హేశ్విత తల్లిని సమస్య అడిగి తెలుసుకున్నారు. తమ పాప ఆపరేషన్‌కు రూ.23 లక్షలు అవుతాయని వైద్యులు చెప్పారని.. ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సీఎంఆర్‌ఎఫ్ నుంచి రూ.10 లక్షలు మంజూరు చేయించారని.. ఇంకా రూ.13 లక్షలు కావాలని తెలిపింది. స్పందించిన పవన్.. ఆఫీసుకు వచ్చి కలవాలని ఆమెకు సూచించారు.