చంద్రబాబుతోనే రైతన్నలకు మేలు: మంత్రి సవిత
ABN , Publish Date - Dec 25 , 2024 | 06:20 AM
సీఎం చంద్రబాబు పాలనలోనే రైతన్నలకు మేలు జరుగుతుందని మంత్రి ఎస్.సవిత అన్నారు.

ఏపీఎస్ఏఎం వైస్ చైర్మన్‌గా మర్రెడ్డి ప్రమాణస్వీకారం
తాడేపల్లి టౌన్, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు పాలనలోనే రైతన్నలకు మేలు జరుగుతుందని మంత్రి ఎస్.సవిత అన్నారు. రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్‌గా మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. ‘జగన్ వ్యవసాయాన్ని, రైతులను గాలికి వదిలేసి వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాడు. వ్యవసాయం గిట్టుబాటుకాక ఎందరో రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు’ అని విమర్శించారు. కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు.