Crossbow: ద్వితీయ సంసద్ ఖేల్ స్పర్ధాలో పాల్గొన్న తెలంగాణ క్రాస్‌బో టీమ్.. 21 మెడల్స్ కైవశం
ABN , First Publish Date - 2023-01-26T10:55:38+05:30 IST
ఆగ్రాలోని ఏకలవ్య స్టేడియం (Eklavya Stadium Agra) వేదికగా జనవరి 19 నుంచి 23 తేదీల మధ్య జరిగిన ద్వితీయ సంసద్ ఖేల్ స్పర్ధాలో (Dwitiya sansadh khel spardha) తెలంగాణ క్రాస్‌బో టీమ్ (Telangana crossbow Team) పాల్గొంది.
హైదరాబాద్: ఆగ్రాలోని ఏకలవ్య స్టేడియం (Eklavya Stadium Agra) వేదికగా జనవరి 19 నుంచి 23 తేదీల మధ్య జరిగిన ద్వితీయ సంసద్ ఖేల్ స్పర్ధాలో (Dwitiya sansadh khel spardha) తెలంగాణ క్రాస్‌బో టీమ్ (Telangana crossbow Team) పాల్గొంది. కేంద్ర సహాయమంత్రి ఎస్‌పీ సింగ్ బాఘెల్ (Law and Justice) మార్గదర్శకాలతో క్రాస్ బో ఈవెంట్ జరిగింది. క్రాస్‌బో క్రీడ, ఆటగాళ్లను ఆయన ప్రోత్సహించారు.

క్రాస్‌బో ఈవెంట్‌లో కల్నల్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ (మాజీ షూటింగ్ అథ్లెట్, ఒలింపిక్ మెడలిస్ట్), నవ్‌నీత్ సింగ్ చాహల్ (ఆగ్రా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్), సునీల్ కుమార్ జోషి (క్షేత్రీయ క్రీడా అధికారి) క్రాస్‌బో ఈవెంట్‌లో ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. పార్లమెంటరీ స్పోర్ట్స్ జాబితాలో క్రాస్‌బో క్రీడను ప్రవేశపెట్టడంతో రాజత్ విజ్ (ఐసీఎస్ఏ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు), హినా విజ్ (ఐసీఎస్ఏ ఉపాధ్యక్షురాలు) చొరవ తీసుకున్నారు.

తెలంగాణకు 21 మెడల్స్..
క్రాస్‌బో అన్ని కేటగిరీల్లో కలిపి తెలంగాణకు మొత్తం 21 పతకాలు దక్కాయి. 8 గోల్డ్ మెడల్స్, 6 రజతాలు, 7 కాంస్యాలను ప్లేయర్లు సాధించారు. బీ.లక్ష్మీ చైతన్య, ఎం. నాగ అక్షయ, ఆర్.మోనాలిసా, కూనదొడ్డి ఎలిజబెత్, కే.అనోక్ దీపక్, కూనదొడ్డి స్టెల్లా దీపికా, పుల్లి అథర్వ, తేజ నాగ వెంకట్ గోల్డ్ మెడల్స్ సాధించారు. కోనా దివ్య రాణి, ఎస్ఎస్ జయరాజు, పీ.భువనేశ్వరి, కృతి మిశ్రా, కూనదొడ్డి రాచెల్, జాన్సన్ డేనియల్ రజతాలు అందుకున్నారు. ఇక వసంత మాధురి, మేజర్ కే.పద్మజ, ఆర్.క్రాస్‌విన్, రిషికా, అలూరి నేహ, అంథోని డేనియల్, కే.లావణ్య కాంస్య పతకాలు సాధించినవారి జాబితాలో ఉన్నారు. తెలంగాణ క్రాస్‌బో షూటింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బీ.లక్ష్మి చైతన్య, టీమ్ మేనేజర్ వీ.వసంత మాధురి, టీమ్ కోఆర్టినేటర్ భువనేశ్వరి ఆటగాళ్ల బృందాన్ని ముందుండి నడిపించారు.

